ఇంజినీరింగ్ విద్యార్థులకు, నిరుద్యోగులకు చక్కటి గుడ్ న్యూస్..భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన న్యూఢిల్లీలోని డీఆర్డీఓ – రిక్రూట్‌మెంట్ అండ్ అసెస్‌మెంట్ సెంటర్ సైంటిస్ట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, ఇతర ముఖ్యమైన సమాచారం గురించి ఇప్పుడు తెలుసుకుందాం…
మొత్తం ఖాళీల సంఖ్య: 58
పోస్టుల వివరాలు: సైంటిస్ట్ పోస్టులు
వయస్సు: అభ్యర్ధుల వయసు 35 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.
అర్హతలు: పోస్టునుబట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్/ ఎంఈ/ ఎంటెక్/ఎమ్మెస్సీలోఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు రుసుము:
జనరల్/ఓబీసీ/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్ధులకు: రూ. 100
ఎస్సీ/ఎస్టీ/పీహెచ్‌సీ/మహిళా అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది.
దరఖాస్తులకు చివరి తేది: జూన్ 28, 2022.
ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాలు చేయాలని అనుకోని వాళ్ళు నోటిఫికేషన్ ను పూర్తిగా చదివి అప్లై చేయాలి..