పేపర్ కప్పుల్లో చాయ్ తాగుతున్నారా? మీ ఆరోగ్యాన్ని మీరే నాశనం చేసుకుంటున్నారు..!

239

ఈరోజుల్లో ఎక్కువ శాతం హోటళ్లలో చాయ్ కోసం పేపర్ కప్పులనే వాడుతున్నారు. వాటినే థర్మాకోల్ కప్పులని కూడా అంటారు. అయితే.. వాటికి పేరు థర్మాకోల్ కప్పులని వచ్చింది కానీ.. వాటిని నిజంగా థర్మాకోల్ లో తయారు చేయడం లేదు. పాలియస్టర్ అనే పదార్థంతో ఆ కప్పులను తయారు చేస్తారు.

అవును.. టైటిల్ చదివి మీరు షాక్ అయి ఉండొచ్చు. కానీ.. ఇది నిజం. నూటికి నూరు పాళ్లు నిజం. ఈరోజుల్లో పది మందిలో తొమ్మిది మంది రోజుకు రెండు నుంచి మూడు సార్లు చాయ్ తాగుతారు. ఇంట్లో అయితే ఎలాగూ స్టీల్ గ్లాసులో లేక గాజు కప్పులో ఉంటాయి వాటిలో తాగేస్తారు. కానీ.. బయటికెళ్లినప్పుడు మాత్రం హోటల్ వాళ్లు ఇచ్చిన కప్పుల్లోనే తాగాల్సి ఉంటుంది.

drinking tea in thermocol cups is harmful to health

ఈరోజుల్లో ఎక్కువ శాతం హోటళ్లలో చాయ్ కోసం పేపర్ కప్పులనే వాడుతున్నారు. వాటినే థర్మాకోల్ కప్పులని కూడా అంటారు. అయితే.. వాటికి పేరు థర్మాకోల్ కప్పులని వచ్చింది కానీ.. వాటిని నిజంగా థర్మాకోల్ లో తయారు చేయడం లేదు. పాలియస్టర్ అనే పదార్థంతో ఆ కప్పులను తయారు చేస్తారు.

పాలియస్టర్ అంటే మరేదో కాదు.. అది కూడా ఒక రకమైన ప్లాస్టిక్. అంటే.. థర్మాకోల్ పేరుతో అమ్మబడుతున్న ఆ కప్పులు ప్లాస్టిక్ కప్పులే.

వేడి వేడి చాయ్ ను ఆ కప్పుల్లో పోయగానే… ఆ కప్పుల్లో ఉండే ప్లాస్టిక్ కణాలు వేడికి కరిగిపోయి టీలో కలుస్తాయట. ఆ చాయ్ ని తాగితే ఇంకేముంది.. ఆ ప్లాస్టిక్ కణాలు డైరెక్ట్ గా శరీరంలోకి వెళ్తాయి.

అవే.. రకరకాల రోగాలకు కేంద్ర బిందువు అవుతున్నాయి. అంతే కాదు.. ప్రాణాంతకమైన క్యాన్సర్ కూడా వచ్చే ప్రమాదం ఉందట. ఈ ప్లాస్టిక్ కణాలు కడుపులో చేరడం వల్ల… హార్మోన్ల అసమతుల్యత, దృష్టి లోపాలు, తరుచుగా అలసట చెందడం, చర్మ రోగాలు లాంటి ఎన్నో సమస్యలు వస్తాయట. కప్పుల్లో ఉండే బ్యాక్టీరియా కోసం పొట్టలో చేరి లేని పోని సమస్యలను తీసుకువస్తుంది.

ఇంకా.. ఈ కప్పులకు ఆర్టిఫిషియల్ వాక్స్ పూస్తారట. చాయ్ ని అందులో పోసినప్పుడు వాక్స్ చాయ్ లో కలిసి కడుపులోకి పోతుంది. అది చిన్న పేగుల్లో ఇన్ఫెక్షన్లను తీసుకొస్తుంది. జీర్ణప్రక్రియ వ్యవస్థను దెబ్బ తీస్తుంది.

చూశారా.. బయట పేపర్ కప్పుల్లో చాయ్ తాగి ఎన్ని రకాల సమస్యలను కొని తెచ్చుకుంటున్నామో.