డ్రోన్ల వినియోగంపై నియమ నిబంధనలు ఉన్నాయని, ఎక్కడ పడితే అక్కడ డ్రోన్లు ఎగరవేయరాదని, దానివల్ల భద్రతకి విఘాతం కలగవచ్చని, గత కొన్ని రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా ఉగ్రవాదులు వీటిని ఉపయోగించి, భద్రతకు భంగం కలిగించవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మొన్నటికి మొన్న కాశ్మీర్ లో డ్రోన్ ఎగరడం వివాదాస్పదమైంది. అలాగే ఆంధ్రప్రదేశ్ లోని తిరుమలలో కూడా ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో డ్రోన్ల వాడకంపై పోలీసులు నిఘా పెట్టారు.
తాజాగా జమ్మూ కాశ్మీర్ లో ఎగిరిన డ్రోన్ ని పోలీసులు గుర్తించారు. అక్నూర్ సెక్టార్ లో ఎగిరిన డ్రోన్ ని పోలీసులు కూల్చివేసారు. డ్రోన్ నుండి ఐఈడీని ని స్వాధీనం చేసుకున్నారు. డ్రోన్ల వినియోగానికి అనేక నియమాలు ఉన్నాయి. దానికోసం ప్రత్యేకించి లైసెన్సు తీసుకోవాల్సిన అవసరమూ ఉంది. అంతేకాదు, అనుమతులు అవసరం లేని ప్రదేశాల్లో 400మీటర్ల కంటే ఎత్తులో డ్రోన్ ఎగరవేయకూడదు.