చాలా మంది శాఖాహారం ( Vegetarian ) మాత్రమే తీసుకుంటూ ఉంటారు. అయితే ఎంతో మందికి తెలియని విషయం ఏమిటంటే..? శాకాహారం తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. శాకాహారం ఆరోగ్యానికి ఎంతో మంచిది. అదే విధంగా మాంసాహారం అంటే చికెన్ మటన్ మొదలైనవి తీసుకోవడం వల్ల సమస్యలు వస్తాయి.
అదే విధంగా కడుపు బరువుగా కూడా అనిపిస్తూ ఉంటుంది. మొక్కల నుండి వచ్చే ఆహారం తీసుకోవడం వల్ల శరీరానికి ఎటువంటి హాని కూడా కలగదు. రెగ్యులర్ గా శాకాహారం మాత్రమే తీసుకునే వాళ్లలో చాలా బెనిఫిట్స్ పొందవచ్చు అని నిపుణులు చెప్తున్నారు. మరి ఆలస్యమెందుకు వాటి కోసం ఇప్పుడే చూసేద్దాం.
అవసరమైన పోషక పదార్థాలు ఉంటాయి:
నమ్మినా నమ్మక పోయినా శాకాహారం మాత్రమే డైట్ లో తీసుకునే వాళ్లలో అవసరమైన పోషక పదార్థాలు ఉంటాయి మరియు ఆరోగ్యంగా ఉండగలరు. ఫైబర్, యాంటీఆక్సిడెంట్స్, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఈ వంటివి శాకాహారంలో దొరుకుతాయి. ఇవి నిజంగా ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి.
ఆరోగ్యకరమైన బరువును పొందొచ్చు:
కేవలం శాకాహారం మాత్రమే తీసుకోవడం వల్ల ఆరోగ్యకరమైన బరువుతో ఉండొచ్చు. శాఖాహారంలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. బరువు తగ్గడానికి బాగా ఉపయోగపడతాయి. అదే విధంగా శాకాహారం చాలా తేలికగా పోషక పదార్థాలతో నిండి ఉంటుంది. ఇది బరువును బ్యాలెన్స్డ్ గా ఉంచుతుంది.
టైప్ 2 డయాబెటిస్ రిస్క్ తగ్గుతుంది:
శాఖాహారం మాత్రమే తీసుకునే వాళ్ళలో బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గుతాయి. మాంసాహారం తీసుకునే వారితో పోల్చుకుంటే వీళ్లలో బాగా తగ్గుతాయి అని నిపుణులు చెబుతున్నారు. శాఖాహారం మాత్రమే తీసుకోవడం వల్ల టైప్ 2 డయాబెటిస్ రిస్క్ తగ్గవచ్చు.
ప్రాణాంతకమైన వ్యాధులు రాకుండా ఉంటాయి:
శాకాహారం తీసుకోవడం వల్ల యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. అదే విధంగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయి. అయితే వీటిలో ఉండే పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ప్రాణాంతకమైన సమస్యలు రాకుండా చూసుకుంటాయి.
మూడ్ ని బాగా ఉంచుతాయి:
తేలికగా మరియు ఆరోగ్యకరంగా తినడం వల్ల పాజిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఏంగ్జైటీ, ఒత్తిడి వంటి సమస్యలు దూరంగా ఉంచొచ్చు.