ఈ మధ్య ఏపీ రాజకీయాలని డ్రగ్స్ అంశం కుదిపేస్తుంది. రాష్ట్రాన్నే కాదు దేశాన్ని సైతం ఈ డ్రగ్స్ అంశం పట్టి పీడిస్తుంది. ఆఖరికి ఈ డ్రగ్స్ వ్యవహారంలో షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ జైలు పాలయ్యాడు అంటే పరిస్తితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. అలాగే తెలుగు సినీ ఇండస్ట్రీకు సంబంధించిన పలువురు ప్రముఖులని ఈడీ విచారణ కూడా చేసింది. ఇలా అన్నిచోట్ల డ్రగ్స్ అంశం కుదిపేస్తుంది. అయితే ఏపీకి సంబంధించి వస్తే గత కొన్ని రోజులుగా డ్రగ్స్ అంశంపై అధికార వైసీపీ, ప్రతిపక్ష టిడిపి నేతల మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయిలో జరుగుతుంది.
ఇక టిడిపి నేతలకు కౌంటర్లు ఇచ్చే భాగంలో చంద్రబాబు, లోకేష్‌లు డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నారు. టిడిపి వాళ్లే డ్రగ్స్ వ్యాపారం నడిపిస్తున్నారని అంటున్నారు. అయితే ఇలా రెండు పార్టీలు నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ అని అనుకుంటున్నాయి. కానీ ఈ విషయంలో రెండు పార్టీలు పెద్ద దొంగలు మాదిరిగానే ఉన్నట్లున్నాయి. అసలు డ్రగ్స్ రాష్ట్రానికి ఎలా రాకుండా చేయాలి? యువతని డ్రగ్స్ వాడకుండా ఎలా చేయాలి? అసలు డ్రగ్స్‌పై ప్రజలకు ఎలాంటి అవగాహన చేయాలి? ఈ డ్రగ్స్‌ని ఎలా అరికట్టాలి? అనే విషయాలని వదిలేసి…ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఇలాంటి విమర్శల వల్ల పాలిటిక్స్ కూడా డ్రగ్స్ మాదిరిగా దరిద్రంగా తయారవుతున్నాయి. కాబట్టి ఇప్పటికైనా రాజకీయ పార్టీలు ఈ డ్రగ్స్ అరికట్టే దానిపై దృష్టి పెడితే బెటర్.