AP : విజయవాడలో పోలీసుల ఆంక్షలు ఉండనున్నాయి. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా విజయవాడలో పోలీసులు ఆంక్షలు విధించారు. రోడ్లపై కేకులు కోసేందుకు అనుమతి లేదని సీపీ కాంతిరాణా టాటా ప్రకటించారు. ‘విజయవాడలో సెక్షన్ 30 అమల్లో ఉంది. ఐదుగురి కంటే ఎక్కువమంది గుడిగూడవద్దు.
కమిషనరేట్ పరిధిలోని ప్రజలు కరోనా నిబంధనలు పాటించాలి. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు చేస్తాం. అర్ధరాత్రి రోడ్లపైకి వచ్చి అల్లరి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం’ అని హెచ్చరించారు. అటు డిసెంబర్ 31వ తేదీ మరియు జనవరి ఒకటో తేదీలలో రెండు రోజులపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని మద్యం షాపులు అర్ధరాత్రి 12 గంటల వరకు పనిచేస్తాయని తెలిపింది. బార్లు క్లబ్బులు పర్మిషన్తో జరిగే ఈవెంట్లలో ఒంటిగంట వరకు మద్యం విక్రయాలకు పర్మిషన్ ఇస్తూ ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది ఎక్సైజ్ శాఖ. దీంతో మందుబాబులు పండుగ చేసుకుంటున్నారు.