గుప్తనిధి, బంగారం అంటూ రూ.17లక్షలు స్వాహా చేసిన డీఎస్పీ..!

-

సాధారణంగా ఎవరైనా మోసం చేస్తే న్యాయం కోసం పోలీసులను ఆశ్రయిస్తాం. అయితే బాధితులకు అండగా ఉండి న్యాయం చేయాల్సిన పోలీసు అధికారే దొంగ బంగారం పేరిట డబ్బులు కాజేసిన ఘటన ఇప్పుడు కామారెడ్డి జిల్లాలో చర్చనీయాంశమైంది.  గతంలో వరంగల్ జిల్లాలో పని చేసిన డీఎస్పీ మదన్ లాల్ ఏడు నెలల క్రితం కామారెడ్డి డీసీఆర్బి విభాగానికి బదిలీపై వచ్చాడు. జిల్లా పోలీస్ కార్యాలయానికి సమీపంలోని ఓ కాలనీలో ఇల్లు కిరాయికి తీసుకుని నివసిస్తున్నాడు. అదే కాలనీకి చెందిన ఓ వ్యక్తితో కొద్దిరోజుల క్రితం పరిచయం ఏర్పడింది.

తనకు తెలిసిన వ్యక్తికి తవ్వకాల్లో గుప్త నిధులు లభించాయని.. రూ.6 లక్షలకే కిలో చొప్పున
బంగారాన్ని ఇప్పిస్తానని నమ్మించాడు. తాను పోలీసునని, అంతా చూసుకుంటానని చెప్పడంతో
నమ్మిన సదరు వ్యక్తి.. రూ. 17 లక్షలకుపైగా ఇచ్చినట్లు తెలిసింది. రోజులు గడుస్తున్నా
బంగారం ఇవ్వకపోవడంతో బాధితుడు 15 రోజుల క్రితం జిల్లా పోలీసు ఉన్నతాధికారిని
ఆశ్రయించాడు. దీంతో ఈనెల 6న డీఎస్పీ మదన్ లాల్ ని ఐజీ కార్యాలయానికి సరెండర్ చేశారు.
అలాగే దేవునిపల్లి పోలీస్ స్టేషన్  లో  కేసు కూడా నమోదు చేశారు. తాజాగా డీఎస్పీని సస్పెండ్ చేసినట్టు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version