దుగ్గిరాల మండలం పినకడిమి లో విషాదం చోటు చేసుకుంది. పూర్తి వివరాలు ని చూస్తే.. దుగ్గిరాల మండలం పినకడిమి లో అత్తమామల వేధింపులు తాళలేక కృష్ణ నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు ఇద్దరు తోడికోడళ్ళు. ఈ రోజుల్లో ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది ఎవరూ చెప్పలేము. ఇటువంటివి ఎక్కువగా జరుగుతున్నాయి.
అత్తమామల వేధింపులు ని తట్టుకో లేక చిన్న కోడలు పాలపాటి స్వాతి మృత దేహం దొరికింది. కానీ పెద్ద కోడలు రుపాదేవి ఆచూకీ మాత్రం దొరక లేదు. విషయం తెలియడం తో అత్త మామలు ఇంటిని ద్వంసం చేసిన మృతురాలి బంధువులు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేస్తున్నారు.