రోడ్డు ప్రమాదంలో.. ఇద్దరు మృతి..!

-

శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఇక దీనికి సంబంధించి వివరాల్లోకి వెళితే… ములుగు జిల్లా తాడ్వాయి మండలం లో శుక్రవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందులో ఇద్దరు యువకులు చనిపోయారు. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం చూస్తే… హనుమకొండ జిల్లా శాయం పేట మండలం పత్తిపాక కి చెందిన పోతుగంటి వంశీ నెల్లూరు పవన్ ద్విచక్ర వాహనం మీద కటాపూర్ వైపు నుండి తడవాయి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

నాంపల్లి గ్రామం వద్ద ద్విచక్ర వాహనం చెట్టు ని ఢీ కొట్టింది ఇలా వాహనం ఢీ కొట్టడం వలన ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఇద్దరు యువకులు వెళ్తుండగా చెట్టుని ఢీ కొనడం వలన చనిపోయినట్లు తెలుస్తోంది. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

Read more RELATED
Recommended to you

Latest news