రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన చైన్ స్నాచింగ్ గురించి దాదాపు అందరికీ తెలిసిందే. నల్లగొండ జిల్లా మర్రిగూడలో చైన్స్ మ్యాచింగ్ కేస్ సంబంధించిన నిందితులు తాాాజాగా పోలీసులకు చిక్కారు. అయితే విచారణలో వారిద్దరూ లవర్స్ కాదని.. భార్యాభర్తలు అని గుర్తించారు పోలీసులు. హైదరాబాద్ సంతోష్ నగర్ కు చెందిన వెంకటేష్ గా నిందితుడిని గుర్తించారు. దొంగతనం చేసిన బంగారాన్ని తాకట్టు పెట్టి నగదు రూపంలోకి చైన్ స్నాచర్లు మార్చుకున్నట్టు పోలీసుల విచారణలో తేలింది.
సునీత అనే మహిళను జనవరి 12వ తేదీన లిప్ ఇస్తామని చెప్పి స్కూటీ ఎక్కించుకున్నారు. ఆ తరువాత కళ్లలో కారం చల్లి ఆమె మెడలో ఉన్నటువంటి 3 తులాల మంగళ సూత్రాన్ని లాక్కెళ్ళారు. పట్టుబడ్డ ఇద్దరు కూడా చెడు వ్యసనాలకు అలవాటు పడి పలు చోరీలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. సెల్ ఫోన్, సిగ్నల్ బండి నెంబర్ ఆధారంగా నిందితులను పోలీసులు ట్రేస్ చేశారు. గతంలో ఎక్కడైనా దొంగతనాలు చేశారా అనే కోణంలో విచారిస్తున్నారు.