నటనకు పనికిరావు.. సినిమాలు ఆపేస్తే మంచిదన్నారు: హీరో దుల్కర్‌

-

‘ఓకే బంగారం’ అంటూ… తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ‘మనసులో నువ్వే ఉన్నావ్ అమ్మాడి’ అంటూ అమ్మాయిల మనసును దోచుకున్నారు. ఇప్పుడు ‘సీతారామం.. యుద్ధం రాసిన ప్రేమ కథ’ అంటూ మన ముందుకు వచ్చి.. మరింత దగ్గరయ్యాడు. ఇంటెన్స్‌ లుక్స్… క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్… మెస్మరైజింగ్ యాక్టింగ్​తో అమ్మాయి మనసు దోచిన హీరో దుల్కర్ సల్మాన్. యాక్టర్​, ప్రొడ్యూసర్​, ప్లే బ్యాక్​ సింగర్​గా చిత్రసీమలో తనదైన ముద్ర వేశారు.

మలయాళంలో మంచి ఫాలోయింగ్‌ ఉన్న నటుల్లో ఒకరైన దుల్కర్‌ కెరీర్‌ ప్రారంభంలో తాను ఎదుర్కొన్న ఒడిదొడుకుల గురించి ప్రస్తావించాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..‘కెరీర్‌ ప్రారంభంలో నా సినిమాలు విడుదలైనపుడు రివ్యూలు, సినీ పండితుల విమర్శలు చదివేవాడిని. కొన్నిసార్లు నాకు నెగెటివ్‌ కామెంట్స్‌ వచ్చేవి. నటనకు పనికిరాననేవారు. తండ్రంత గొప్ప నటుడు కాడు. సినిమాలు ఆపేస్తే మంచిది అంటూ రాసిన వార్తలన్నీ బాధించాయి. కానీ వీటన్నింటిని పక్కన పెట్టి నటనపై దృష్టి సారించాను’ అని దుల్కర్‌ వెల్లడించాడు.

మలయాళ సూపర్‌స్టార్‌ ముమ్ముట్టి కుమారుడిగా 2012లో ‘సెకండ్‌ షో’ చిత్రం ద్వారా సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇప్పటివరకు మలయాళంలో దాదాపు 30కి పైగా సినిమాల్లో హీరోగా నటించాడు. వీటిలో ఉస్తాద్‌ హోటల్‌, బెంగుళూరు డేస్‌, చార్లీ, కురూప్‌ లాంటి సినిమాలు భారీ విజయాలను సాధించాయి. 2018లో వచ్చిన మహానటి తెలుగులో దుల్కర్‌కి తొలిచిత్రం. అందులో జెమినీ గణేశన్‌ పాత్ర పోషించిన దుల్కర్‌ తెలుగు ప్రేక్షకులను మెప్పించాడు. తాజాగా సీతారామం లాంటి ప్రేమకథా చిత్రంతో మరో విజయం సాధించాడు. ప్రస్తుతం దుల్కర్‌ చుప్ అనే హిందీ థ్రిల్లర్‌ చిత్రంలో కథానాయకుడిగా నటించారు. ఈనెల(సెప్టెంబరు) 23న చుప్ విడుదల కానుంది. ఇది కాకుండా దుల్కర్‌ ఖాతాలో అయిదారు మలయాళ చిత్రాలు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news