సెప్టెంబర్ 21వ తేదీ నుంచి స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఒకవేళ దసరా సెలవులలో ప్రైవేట్ స్కూళ్లు కాలేజీలలో ఎలాంటి తరగతులను నిర్వహించకూడదని ప్రభుత్వం కీలక ఆదేశాలను జారీ చేసింది. ఇందుకు విరుద్ధంగా వ్యవహరించినట్లయితే కఠినమైన చర్యలను తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. సెలవులలో రివిజన్ కోసం విద్యార్థులకు కొంతవరకు హోంవర్క్ ఇవ్వాలని పేర్కొన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లకు ఈ నెల 21 నుంచి అక్టోబర్ 3 వరకు, జూనియర్ కాలేజీలకు ఈనెల 28 నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు సెలవులు ఉండనున్నాయి. ఇదిలా ఉండగా…. తెలంగాణలో బతుకమ్మ, దసరా పండుగను ఎంతో వైభవంగా జరుపుకుంటారు. ప్రతి ఒక్కరూ వారి సొంత ఊర్లకు చేరుకొని బతుకమ్మ, దసరా పండుగను కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా చేసుకుంటారు. ఈ నేపథ్యంలోనే స్కూళ్లు కాలేజీలకు తప్పకుండా సెలవులను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.