అమీషా పటేల్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈమె అనేక సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది. తెలుగు, హిందీలో అనేక సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా ఒకానొక సమయంలో తన హవాను కొనసాగించిందని చెప్పవచ్చు. అనంతరం కొత్త హీరోయిన్లు సినీ ఇండస్ట్రీకి పరిచయం కావడంతో ఈ బ్యూటీకి సినిమా అవకాశాలు కాస్త తగ్గుముఖం పట్టాయి. తాజాగా అమీషా పటేల్ ఓ పాడ్ కాస్ట్ లో పాల్గొన్నారు. అందులో భాగంగా తనకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసుకున్నారు.

ముఖ్యంగా తన వివాహానికి సంబంధించి సంచలన కామెంట్లు చేశారు. వివాహం తర్వాత చాలామంది మహిళలకు పని చేయొద్దని కండిషన్లు పెడుతున్నారు. ఆ కారణం వల్లనే నేను ఇప్పటి వరకు వివాహం చేసుకోలేదంటూ అమీషా అన్నారు. 50 ఏళ్ల వయసులోనూ నాకు ఇప్పటికీ పెళ్లి ప్రపోజల్ వస్తున్నాయి. నా ఏజ్ లో సగం వయసున్న వారు నన్ను డేట్ కి రమ్మని పిలుస్తున్నారు. సినిమాల్లోకి రాకముందు సీరియస్ గా రిలేషన్ షిప్ లో ఉన్నాను. ఆ వ్యక్తి నన్ను సినిమా ఇండస్ట్రీకి వెళ్లొద్దని చెప్పడంతో నేను అవకాశాలను వదులుకున్నానని అమీషా అన్నారు. ఆ తర్వాత మా మధ్య బ్రేకప్ జరిగిందని వెల్లడించారు. ఇప్పటికీ సరైన వ్యక్తి దొరికినట్లైతే వివాహం చేసుకోవడానికి నేను సిద్ధంగానే ఉన్నానంటూ అమీషా పటేల్ సంచలన కామెంట్లు చేశారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారుతుంది.