ఏపీలోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై దేవీ శరన్నవరాత్రులు కన్నులపండువగా జరుగుతున్నాయి. దసరా నవరాత్రి ఉత్సవాలకు పెద్దఎత్తున భక్తులు తరలివస్తున్నారు. రోజుకో అలంకారంలో దర్శనమిస్తున్న అమ్మవారిని దర్శించుకుంటున్నారు. రెండో రోజైన ఇవాళ దుర్గమ్మ బాలత్రిపురసుందరిదేవిగా భక్తులకు కనువిందు చేస్తోంది. తెల్లవారుజాము నుంచే భక్తులు అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు.
వృద్ధులు, దివ్వాంగులకు ఆలయ కమిటీ ప్రత్యేక సేవలు అందిస్తోంది. నేటి నుంచి వారికి దర్శనానికి ప్రత్యేక సమయాన్ని కేటాయించింది. ప్రతి రోజు ఉదయం 10 నుంచి 12 వరకు, సా. 4 నుంచి 6 వరకు దర్శనాన్ని కేటాయించారు. అక్టోబర్ 2న మినహా ఇతర రోజుల్లో వృద్ధులు, దివ్యాంగులకు దర్శనం కల్పించనున్నారు.