తెలంగాణ ప్రభుత్వం పాఠశాల విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. రేపటి నుండి దసరా సెలవులు ఇస్తున్నట్టు ప్రకటించింది. రేపటి నుండి ఈ నెల 17వరకు విద్యార్థులకు సెలవులు ప్రకటించింది. ఇక మళ్లీ తిరిగి ఈ నెల 18న స్కూళ్ళు పునఃప్రారంభం కానున్నాయి.
ఇదిలా ఉండగా కరోనా నేపథ్యం లో ఇంతకాలం విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు జరగ్గా సెప్టెంబర్ 1 నుండి ప్రత్యక్ష బోధన మొదలైంది. స్కూళ్ళు ప్రారంభించిన తరవాత పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురవడం తో తరగతులు తక్కువ రోజులే జరిగాయి. ఇక ఇప్పుడు దసరా సెలవులు ప్రకటించారు.