ఏనుగుల తొక్కిసలాటపై పవన్‌ రియాక్ట్‌…రూ.10 లక్షల ఎక్స్‌ గ్రేషియా ప్రకటన !

-

ఏనుగుల తొక్కిసలాటలో ముగ్గురు భక్తులు మృతి చెందిన ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి చెందారు. అటవీ శాఖ ఉన్నతాధికారులు, అన్నమయ్య జిల్లా అధికార యంత్రాంగం నుంచి ఘటన వివరాలు తెలుసుకున్నారు పవన్ కళ్యాణ్. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.

Pawan reaction to elephant stampede Rs. 10 lakh ex gratia announcement

మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, క్షతగాత్రులకు రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించాలని ఆదేశాలు ఇచ్చారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా అటవీ ప్రాంతాల్లో ఉన్న అలయాలను దర్శించుకునే భక్తులకి తగిన భద్రత ఏర్పాట్లు చేయాలని సూచనలు చేశారు. మృతుల కుటుంబాలను, క్షతగాత్రులను పరామర్శించి భరోసా ఇవ్వాలని ప్రభుత్వ విప్, రైల్వే కోడూరు ఎమ్మెల్యే శ్రీ అరవ శ్రీధర్ కు దిశానిర్దేశం చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.

Read more RELATED
Recommended to you

Latest news