ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతులకు బిగ్ అలర్ట్. ఇవాల్టి నుంచి ఈ పంట నమోదు కార్యక్రమం ఉండనుంది. ఈ మేరకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. రవి సీజన్ కు సంబంధించిన సాగు చేసిన ప్రతి… పంటను నమోదు చేసేందుకు ఈ పంట కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ఇవాల్టి నుంచి ప్రారంభం కాబోతుంది.
జియో ఫెన్సింగ్ ద్వారా గరిష్ట నిడివి 50 మీటర్ల లోపు పంట వివరాలను నమోదు చేయాలని… ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారిక ఆదేశాలు వచ్చాయి.. వచ్చే సంవత్సరం మార్చి 15 నాటికి ఈ జాబితాను ఫైనల్ చేయనున్నారు. ఫైనల్ చేసిన అనంతరం… రైతు కేంద్రాలలో ప్రదర్శిస్తారు ఈ జాబితాను…!కేంద్ర అలాగే రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఏదైనా పరిహారం అందాలంటే కచ్చితంగా ఈ లిస్టులో… రైతుల వివరాలు ఉండాల్సిందే. లేకపోతే పంట పరిహారం రావడం కష్టమవుతుందని అధికారులు చెబుతున్నారు. అందుకే ప్రతి రైతు ఈ పంట కార్యక్రమంలో పాల్గొనాలని చెబుతున్నారు