తెలంగాణ రాష్ట్ర రాజకీయాలపై మరోసారి కాంగ్రెస్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే 12, 18 నెలల లోపు తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తాయని రేవంత్ సంచలన స్టేట్ మెంట్ ఇచ్చారు. అయితే.. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు తథ్యమని.. రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందన్నారు.
కేసీఆర్.. ప్రశాంత్ కిషోర్ అనే రాజకీయ వ్యూహ కర్తను తీసుకొచ్చాడు అంటే అతని పైన నమ్మకం కోల్పోయాడంటూ చురకలు అంటించారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ ను నమ్మడం లేదని కేసీఆర్ బావించి వ్యూహకర్తను తెచ్చాడని నిప్పులు చెరిగారు. కేసీఆర్ ఇచ్చిన హామీలు ఎక్కడ అమలు పర్చాడా… అన్ని అమలు చేస్తే ప్రశాంత్ కిషోర్ అవసరం వచ్చేదా…అని మండిపడ్డారు. కేసీఆర్ చేతిలో మోస పోని వారు ఎవ్వరు లేరు..ప్రభుత్వం తీసుకొచ్చిన 317 జీఓ సవరించకపోతే ఓ టీచర్ చనిపోయాడని నిప్పులు చెరిగారు. లక్షల ఎకరాల్లో మిర్చి రైతులు నష్ట పోయారని.. కేసీఆర్ పాలన లో ఎవ్వరు సంతోషంగా లేరన్నారు.