వచ్చే నెల 1 వ తేదీ నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేడు సమావేశం కానుంది. ఈ రోజు మధ్యాహ్నం 1 : 00 గంటలకు ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం ప్రారంభం కానుంది. కాగ ఈ బడ్జెట్ సమావేశాల్లో టీఆర్ఎస్ ఎంపీలు రాజ్యసభలో, లోక్ సభలో అనుసరించాల్సిన వ్యూహాలను సీఎం కేసీఆర్ సూచించనున్నారు. కేంద్రం నుంచి రావాల్సిన బకాయిల తో పాటు బడ్జెట్ లో రాష్ట్ర కేటాయింపులు పై పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో కేంద్రాన్ని ప్రశ్నించాలని ఎంపీలకు సీఎం కేసీఆర్ దిశా నిర్ధేశం చేయనున్నారు.
అలాగే రాష్ట్రం ఏర్పడి సంవత్సరాలు గడుస్తున్న పునర్విభజన హక్కులు, సమస్యలు పరిష్కారం కాలేదు. దీంతో దీని పై పార్లమెంట్ లో కేంద్రాన్ని నిలదీయాలని సూచించే అవకాశం ఉంది. అలాగే రాష్ట్రానికి ఇప్పటి వరకు కేంద్ర ప్రాజెక్టులు రాలేవు.. దీని పై కూడా కేంద్రాన్ని ప్రశ్నించాలని సూచించే అవకాశం ఉంది. అలాగే ఈ బడ్జెట్ సమావేశాల్లో కావాల్సిన విషయాలను, నిధులకు సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రికి రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఇప్పటికే పలు లేఖలు రాశారు. ఈ లేఖలలో ఉన్న అంశాలను చర్చించే అవకాశం ఉంది.