మీ స్వేఛ్ఛని హరించే పొసెసివ్ నెస్.. ఈ లక్షణాలతో తొందరగా గుర్తించండి.

-

పొసెసివ్ నెస్.. నువ్వు నాకే స్వంతం అన్న భావన మొదట్లో బాగానే ఉంటుంది. ప్రేమించిన కొత్తల్లో అదొక తియ్యటి అనుభూతిగా అనిపిస్తుంది. కానీ, పొసెసివ్ నెస్ పెరిగితే మీ బంధానికే ప్రమాదంగా మారవచ్చు. పొసెసివ్ నెస్ లో గీత దాటినపుడు అవతలి వారిపై అజమాయిషీ చలాయించినట్లుగా అనిపిస్తుంది. అక్కడే సమస్యలు మొదలవుతాయి. మీరు డేటింగ్ లో ఉన్న భాగస్వామిలో పొసెసివ్ నెస్ లక్షణాలు కనిపిస్తున్నాయేమో చెక్ చేసుకోండి.

సందేశాల ప్రవాహం

మీరు ఎక్కడ ఉన్నారనేది మొదలుకుని, అది నిజమా కాదా అన్న దానివరకు మెసేజీలు చేస్తూనే ఉంటారు. చాలాసార్లు మీరు చెప్పేది నమ్మకుండా మళ్ళీ మళ్ళీ అడుగుతారు. వరుస పెట్టి సందేశాలు, స్పందించకపోతే కాల్స్ చేస్తుంటారు.

మీ స్నేహితులతో బయటకు వెళ్ళడం వారిని బాధిస్తుంది

ఏ పనిమీద అయినా మీ స్నేహితులతో బయటకు వెళ్ళడం వారికి బాధ కలిగిస్తుంది. ఒంటరిగా విడిచి వెళ్ళిపోతావా అన్న ఎమోషనల్ డ్రామా ప్లే చేస్తారు. కొంచెం స్పేస్ కావాలని మీరు కోరుకున్నప్పుడు ఇలాంటివి ఇబ్బంది పెడుతుంటాయి.

అవాస్తవిక అంచనాలు

మీ భాగస్వామి మీపై చాలా అంచనాలు పెట్టుకుంటారు. ముఖ్యంగా ఫస్ట్ రింగ్ కే కాల్ ఎత్తాలని, సరైన సమయానికే రావాలని అనుకుంటారు. వాళ్ళతో లేని సమయాల్లొ ఎక్కడ ఉంటున్నారన్న ఆలోచనలు ఎక్కువగా వస్తుంటాయి.

లక్ష్యాలకు అడ్డుగా నిలబడతారు

వాళ్ళెప్పుడూ మీ లక్ష్యాలని పెద్దగా పట్టించుకోరు. మీ లక్ష్యం కోసం వేరే చోటుకి వెళ్ళడానికి అస్సలు ఇష్టముండదు. ఎప్పుడూ రిలేషన్ షిప్ గురించే ఆలోచిస్తారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version