టైలరింగ్ బిజినెస్ చేస్తూ లక్షల్లో సంపాదన.. 10 మంది మహిళలకు ఉచితంగా శిక్షణ కూడా..!

-

జీవితంలో ఒకసారి కష్టమైన పరిస్థితులు వస్తే మరొక సారి ఇబ్బందులేమీ లేకుండా హాయిగా ఉండగలం. అయితే జీవితంలో ఒక్కో సారి ఏమి జరుగుతుంది అన్నది ఎవరికీ తెలియదు. అయితే జీవితంలో మనం తీసుకునే నిర్ణయాన్ని బట్టి మన జీవితం ఉంటుంది కూడా. అయితే ఈమె ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకుంది. దీనీతో ఆమె జీవితమే మారిపోయింది.

 

అస్సాంలోని రంగియాకు చెందిన రుంజున్ బేగం జీవితాన్ని ఒక నిర్ణయం మార్చేసింది. అత్తమామల నుంచి ఆమెకి వేధింపులు వచ్చాయి. పైగా భర్త కూడా ఆమెను వేధించేవాడు. ఆమె రెండు సార్లు ఆడపిల్లకు జన్మనివ్వడం తో ఇబ్బంది తప్పలేదు. పైగా మూడవ సారి గర్భవతి అయ్యింది.

కానీ భర్త ఆమెని గర్భం తీయించుకోమన్నాడు. ఈ కారణంగా ఆమె ఐదు నెలల గర్భవతి అయినప్పుడు ఇంటిని వదిలి వెళ్ళిపోయింది. ఎంతో కష్టపడి వ్యాపారాన్ని మొదలు పెట్టింది. ఇప్పుడు నెలకి లక్ష రూపాయలు సంపాదిస్తోంది.

దానితో పాటుగా పది మంది మహిళలకు ఉచితంగా కుట్టుపని లో శిక్షణ ఇస్తోంది. సొంత కాళ్ళ మీద నిలబడటం ఆమెకి చాలా గర్వంగా వుంది అని చెప్పింది.పైగా ఈ స్థాయికి చేరుకోవడం నిజంగా గొప్ప విషయం. ఇలాంటి మహిళలను = మనం ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్లాలి. అప్పుడు మనం కూడా జీవితంలో ముందుకు వెళ్లగలం.

Read more RELATED
Recommended to you

Latest news