ఉత్తరాఖండ్ లో భూకంపం..3.8 తీవ్రతో కంపించిన భూమి

-

ఇటీవల భారత్ లో తరచుగా భూకంపాలు సంభవిస్తున్నయి. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలు మిజోరం, మణిపూర్ లతో పాటు హిమాలయ రీజియన్, అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపాలు వస్తున్నాయి. రిక్టర్ స్కేల్ పై తక్కువ తీవ్రతతో సగటున 4 తీవ్రతతో భూకంపాలు సంభవిస్తున్నాయి. దీంతో పెద్దగా ఆస్తి, ప్రాణ నష్టాలు ఉండటం లేదు.

తాజాగా మరోసారి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఆదివారం ఉదయం భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్ పై 3.8 తీవ్రతతో భూమి కంపించింది. ఉత్తరాఖండ్ లోని తేహ్రీ గర్వాల్ ప్రాంతంలో భూకంపం వచ్చింది. భూకంప కేంద్రం 10 కిలోమీటర్ల లోతులో కేంద్రీక్రుతం అయిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది.

ఇదిలా ఉంటే ఇండోనేషియా ను శక్తివంతమైన భూకంపం తాకింది. రిక్టర్ స్కేలుపై 6.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఉత్తర సులవేసి ప్రావిన్స్ లో ఈ భూకంపం వచ్చినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news