ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి..? పబ్లిక్ పల్స్ ఎలా ఉంది… తెలుసుకోవడానికి అందరికీ ఉత్సుకత ఉంది. ఈ సర్వేలు, అభిప్రాయ సేకరణలు ఒకలా.. ఫలితాలు మరొకలా ఉన్న సందర్భాలు ఉన్నాయి. ఆంద్రప్రదేశ్ ఎన్నికల్లో మాత్రం ఉత్కంఠ నెలకొని ఉంది.. క్షణ క్షణం మారుతున్న పరిణామాలతో అసలేం జరుగుతుందో తెలుసుకోవడం చాలా కష్టం. అసలు ఏపీలో త్రిముఖ పోటీ ఉందా? ద్విముఖ పోటీ ఉందా? అసలు ప్రధాన పార్టీల మధ్య పోటీ ఉందా? లేదా? ఇలా ప్రజల్లో ఎన్నో రకాల అనుమానాలు ఉన్నాయి. అయితే.. రాష్ట్రం మొత్తం మీద అన్ని జిల్లాల్లో ఒకే రకం తీర్పు ఉండదు. ఒక జిల్లాలో ఒక పార్టీకి మెజారిటీ ఉంటే.. ఇంకో జిల్లాలో.. ఇంకో పార్టీకి మెజారిటీ ఉంటుంది. మరి తూర్పుగోదావరి జిల్లా ప్రజలు ఏమనుకుంటున్నారు.. ఎవరు ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారు.. తెలుసుకోవాలనుందా? ఈ వీడియో చూసేయండి..