వండిన ఆహార పదార్థాలను ఎక్కువ రోజుల పాటు ఫ్రిజల్‌లో నిల్వ ఉంచి అనంతరం వాటిని తీసి వేడి చేసుకుని తినడం మన ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. అదేంటీ.. ఫ్రిజ్‌లోనే ఆహారాన్ని ఉంచుతున్నాం కదా.. ఎలా పాడవుతుంది..? అని కొందరికి సందేహం కలగవచ్చు.
టెక్నాలజీ మనకు అందించిన అనేక ఎలక్ట్రానిక్ పరికరాల్లో ఫ్రిజ్ కూడా ఒకటి. వేసవిలోనే కాదు, ఇతర ఏ కాలంలో అయినా సరే ఫ్రిజ్ మనకు ఎలా ఉపయోగపడుతుందో అందరికీ తెలుసు. చల్లని పానీయాల కోసమే కాక, ఆహారాన్ని నిల్వ ఉంచేందుకు కూడా ఫ్రిజ్‌లు ఎంతో పనికొస్తాయి. అయితే ఆహారాన్ని నిల్వ ఉంచే విషయానికి వస్తే.. పండ్లు, కూరగాయాలను ఫ్రిజ్‌లో ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంచితే ఏమీ కాదు.. కానీ వండిన ఆహారాన్ని మిగిలింది కదా అని చెప్పి ఫ్రిజ్‌లో ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంచితేనే సమస్యలు వస్తాయి.
మనం సాధారణంగానే ఆహారం ఎక్కువగా వండుతుంటాం. ఎందుకంటే ఎవరు ఎప్పుడు ఎంత తింటారో ఇంట్లో వండే వారికి తెలియదు కదా. దీంతో ఎవరికీ తక్కువ అవకూడదని చెప్పి మన ఇండ్లలో ఎక్కువగానే ఆహారాన్ని వండుతుంటారు. దీంతో ఒక్కోసారి వండిన కూరలు, అన్నం.. తదితర ఆహారాలు మిగిలిపోతుంటాయి. వాటిని పడేయడానికి మనస్సు రాదు. దీంతో వాటిని ఫ్రిజ్‌లో పెట్టుకుని మరుసటి రోజో, తరువాత రోజో బయటకు తీసి వేడి చేసుకుని తింటుంటారు. నిజానికి ఇలా చేయడం సరికాదు.
వండిన ఆహార పదార్థాలను ఎక్కువ రోజుల పాటు ఫ్రిజల్‌లో నిల్వ ఉంచి అనంతరం వాటిని తీసి వేడి చేసుకుని తినడం మన ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. అదేంటీ.. ఫ్రిజ్‌లోనే ఆహారాన్ని ఉంచుతున్నాం కదా.. ఎలా పాడవుతుంది..? అని కొందరికి సందేహం కలగవచ్చు. కానీ ఆహారాన్ని వండాక క్రమంగా వేడి తగ్గే కొద్దీ అందులో బాక్టీరియా నిర్మాణమవుతూనే ఉంటుంది. అయితే అలాంటి ఆహారాన్ని ఫ్రిజ్‌లో ఉంచినా బాక్టీరియా పెరగడం ఆగదు. కాకపోతే తక్కువ పెరుగుదల ఉంటుంది. అంతేకానీ.. ఆహారం బాగుంది అనుకోకూడదు. అది చాలా నెమ్మదిగా పాడవుతూ ఉంటుంది. కనుక మనకు ఏమీ తెలియదు. దాన్ని బయటకు తీసి వేడి చేసుకుని తింటాం. అయితే ఈ విషయాన్ని సైంటిస్టులు చేపట్టిన పరిశోధనలే వెల్లడిస్తున్నాయి. కనుక ఇకపై ఎవరైనా సరే.. ఫ్రిజ్‌లలో ఆహారాన్ని నిల్వ ఉంచి దాన్ని వేడి చేసుకుని తినడం మానేయాలి. వీలైనంత వరకు మనకు సరిపోయినంతే వండుకుని ఆహారం వేడిగా ఉండగానే తినేయాలి. దీంతో ఆరోగ్యంగా ఉండవచ్చు..!