వకీల్ సాబ్ షూట్ కోసం మెట్రో ఎక్కిన పవన్ కళ్యాణ్..

సినిమాలే మానేస్తాను అని చెప్పి రాజకీయాల్లో బిజీ అయిన పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాల్లో బిజీ అయ్యారు. అంతే కాదు రీ ఎంట్రీ తరువాత ఆయన వరుస సినిమాలు ప్రకటించారు. ఈ రీ ఎంట్రీ తర్వాత ఆయన చేస్తున్న మొదటి సినిమా వకీల్ సాబ్. వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. బాలీవుడ్ లో పింక్ సినిమాకి ఈ సినిమా తెలుగు రీమేక్ గా తెరకెక్కుతోంది. కరోనా లాక్డౌన్ సడలింపు ఇచ్చాక మిగతా సినిమాల్లాగే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలైంది.

pawan kalyan
pawan kalyan

అయితే ఈ సినిమా షూటింగ్ కోసం పవన్ కళ్యాణ్ మెట్రో మెట్రోల్లో ప్రయాణించడం గమనార్హం. ఆయన మాదాపూర్ నుంచి మియాపూర్ వరకు మెట్రో ప్రయాణిస్తున్నారు. ప్రస్తుతం వకీల్ సాబ్ షూటింగ్ మియాపూర్ లో జరుగుతుండగా జూబ్లీహిల్స్ లోని తన నివాసం నుంచి మాదాపూర్ మెట్రో స్టేషన్ కి వెళ్ళిన పవన్ అక్కడ మియాపూర్ వెళ్లే రైలు ఎక్కారు. ఒకవేళ షూట్ కి ఆలస్యం కాకూడదు అని ఇలా వెళుతున్నారా లేక మెట్రోని పరిశీలించడానికి వెళుతున్నారా అనేది తెలియాల్సి ఉంది.