చేతులతో అన్నం తింటున్నారా? అయితే ఇది చదవండి..!

-

చాలామంది చేతులతోనే అన్నం తింటారు. ఆహారాన్ని ఆస్వాదిస్తూ చేతులతో తిని ఆనందిస్తారు. చేతులతో తింటేనే వాళ్లకు తృప్తి. అదో తృప్తి అంతే. అయితే.. చేతులతో అన్నం తినేవాళ్లు వాళ్లకు తెలియకుండానే తమ ఆరోగ్యాన్ని తాము పదిలంగా కాపాడుకుంటున్నారు. స్పూన్లతో, ఫోర్క్ తో తినే వాళ్ల కన్నా చేతులతో ఆహారాన్ని తినేవాళ్లు హాయిగా వందేళ్లు బతుకుతారట.

తులతో ఆస్వాదిస్తూ అన్నం తినేవాళ్లలో బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుందట. చేతులతో అన్నం తినడం వల్ల కండరాలకు పని పెరుగుతుంది. దీంతో బ్లడ్ సర్క్యులేసన్ పెరుగుతుంది. చేతులతో అన్నం తినడం వల్ల ఫుడ్ తో ఓ బంధం ఏర్పడుతుంది. అదో ఎమోషన్. ఫోర్క్ , స్పూన్ తో తింటే ఆ ఎమోషన్ రాదు. చేతులతో తినడం వల్ల ఆహారం విలువ తెలుస్తుంది. దానితో ఓ బంధం ఏర్పడుతుంది.

ఆయుర్వేదం ప్రకారం.. నోట్లోకి చేతి వేళ్ల ద్వారా ఆహారాన్ని పంపించడం అనేది యోగ ముద్ర. అది జ్ఞాన అవయవాలను యాక్టివేట్ చేస్తుంది. ఆహారాన్ని చేతి వేళ్లతో తాకుతూ తినడం వల్ల… వేళ్లలో ఉన్న నరాలు మెదడు సిగ్నల్ పంపిస్తాయి. దీంతో శరీరంలో జీర్ణవ్యవస్థకు సంబంధించిన రసాలు జీర్ణాశయంలో విడుదలవుతాయి. దీంతో తిన్న ఆహారం ఈజీగా జీర్ణమవుతుంది.

వేదాల ప్రకారం.. మన చేతి వేళ్లకు, గుండెకు, మూడో నేత్రానికి, గొంతుకు, నాడి కూటమి, ఇతర రూట్ చక్రాలను లింక్ ఉంటుంది. అందుకే.. చేతివేళ్లతో అన్నం తినడం వల్ల వాటి పని తీరు మెరుగుపడుతుంది.

మీరు స్పూన్, ఫోర్క్ తో తింటే ఆహారం వేడిగా ఉందా? చల్లగా ఉందా? అనేది తెలుస్తుందా? తెలియదు కదా. కానీ.. చేతులతో తింటే ఆహారం వేడిగా ఉందా? చల్లగా ఉందా? ఇట్లే తెలిసిపోతుంది. స్పూన్లు, ఫోర్క్ ల కన్నా చేతులే పరిశుభ్రంగా ఉంటాయి. బ్యాక్టిరీయా ఎక్కువగా స్పూన్లకే ఉండే ప్రమాదం ఉంది.

రొట్టెలు, పప్పు.. చేతులతో కాకుండా ఫోర్క్ తో తింటే ఎలా ఉంటుందో ఊహించుకోండి. అది సాధ్యమయ్యే పనేనా? అందుకే.. చాలామంది చేతులతో తినడానికే ప్రాధాన్యం ఇస్తారు. మాంసాహారం తినేటప్పుడు కూడా ఎముకలు తినే సమయంలో ఫోర్కులు, స్పూన్లు పనిచేయవు.

Read more RELATED
Recommended to you

Exit mobile version