ఈ స్నాక్స్ తింటే బరువు తగ్గొచ్చు..!

-

మనం పనులు చేసుకుంటూ ఉంటే మధ్య మధ్యలో ఏదో ఒకటి తినాలి అనిపిస్తూ ఉంటుంది. అటువంటి సమయంలో ఏది పడితే అది తింటే మరింత బరువు పెరిగి పోతారు అని చాలా మంది భయ పడుతూ ఉంటారు. అయితే ఇక్కడ కొన్ని బరువు తగ్గే స్నాక్స్ ఉన్నాయి. వాటి కోసం మరి తెలుసుకోండి. ఆలస్యం ఎందుకు ఇప్పుడే పూర్తిగా చూసేద్దాం.

 

మీరు ఏమైనా పని చేసుకున్నప్పుడు వీటిని తింటే మీకు ఎటువంటి నష్టం ఉండదు. పైగా ఇవి బరువు తగ్గడానికి ఉపయోగపడతాయి.

పాప్ కార్న్:

దీనిని ఎప్పుడు తిన్నా చాలా బాగుంటుంది. వర్క్ చేసేటప్పుడు కూడా ఈజీగా మనం తీసుకోవచ్చు అయితే దీనిని తయారు చేసే పద్ధతి బట్టి ఆరోగ్యం ఉంటుంది. మీరు దీనిని ప్రిపేర్ చేసుకుని ఒక ఎయిర్ టైట్ కంటైనర్ లో పెట్టుకుని ఎప్పుడైనా తినవచ్చు.

శనగలు:

నల్ల శనగలు ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిలో పోషక పదార్థాలు ఉంటాయి. దీనిలో మీరు కొద్దిగా సాల్ట్ వేసుకుని తీసుకోవచ్చు. లేదంటే బెల్లం వేసుకుని తీసుకోవచ్చు. సాయంత్రం పూట తీసుకోవడానికి ఇది బాగుంటుంది. బ్లడ్ షుగర్ లెవల్స్ ని బ్యాలెన్స్ చేస్తుంది మరియు రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. పైగా దీనిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆరోగ్యానికి కూడా ఇది మేలు చేస్తుంది.

రోస్టేడ్ నట్స్:

వీటిని తీసుకుంటే కూడా ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. ఆకలిగా అనిపించినప్పుడు రోస్ట్ చేసిన బాదం, జీడిపప్పు, వాల్ నట్స్ లాంటివి తీసుకోవచ్చు. వీటివల్ల తక్షణ శక్తి వస్తుంది.

గింజలు:

గింజలు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. గుమ్మడి గింజలు, సన్ఫ్లవర్ గింజలు, చియా సీడ్స్, ఫ్లేక్ సీడ్స్ కూడా తీసుకోవచ్చు వీటి వల్ల కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. బరువు తగ్గడానికి కూడా ఇవి బాగా ఉపయోగపడతాయి. పైగా ఇందులో ఎక్కువగా ఫైబర్, ప్రోటీన్ సమృద్ధిగా ఉంటాయి. దీనిని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎటువంటి హాని కూడా కలగదు.

Read more RELATED
Recommended to you

Latest news