వాల్‌న‌ట్స్‌ను త‌ర‌చూ తింటే అల్స‌ర్లు, క్యాన్స‌ర్లు రావు.. సైంటిస్టుల వెల్ల‌డి..

-

నిత్యం వాల్‌న‌ట్స్‌ను తిన‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. ముఖ్యంగా వాల్‌న‌ట్స్ తో మెద‌డు ప‌నితీరు మెరుగు ప‌డుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అధిక బ‌రువు త‌గ్గేందుకు స‌హాయ ప‌డ‌తాయి. అయితే నిత్యం వాల్‌న‌ట్స్‌ను తీసుకోవ‌డం వ‌ల్ల జీర్ణాశ‌యం, పేగుల్లో అల్స‌ర్లు రాకుండా ఉంటాయ‌ని సైంటిస్టులు తేల్చారు.

హెచ్‌.పైలోరి అనే బాక్టీరియా మ‌న‌కు అనేక విధాలుగా సోకుతుంది. దీర్ఘ‌కాలికంగా ఈ వ్యాధి బారిన ప‌డితే జీర్ణ‌వ్య‌వ‌స్థ ప‌నితీరు దెబ్బ‌తింటుంది. దీంతోపాటు అల్స‌ర్లు వ‌స్తాయి. అయితే నిత్యం వాల్‌న‌ట్స్‌ను తిన‌డం వ‌ల్ల స‌ద‌రు బాక్టీరియా న‌శిస్తుంది. దీంతో జీర్ణ స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి. ఈ మేర‌కు కొరియాలోని సీహెచ్ఏ క్యాన్స‌ర్ ప్రివెన్ష‌న్ రీసెర్చ్ సెంట‌ర్ కు చెందిన సైంటిస్టులు తాజాగా ఎలుక‌ల‌పై ప్ర‌యోగాలు చేసి పై విష‌యాన్ని తెలియ‌జేశారు.

కొన్ని ఎలుక‌ల‌కు వారు నిత్యం వాల్‌న‌ట్స్‌తో కూడిన డైట్‌ను ఇచ్చారు. త‌రువాత ప‌రిశీలించి చూడగా వాల్‌న‌ట్స్‌ను తీసుకున్న ఎలుక‌ల్లో హెచ్‌.పైలోరి బాక్టీరియా న‌శించిన‌ట్లు గుర్తించారు. సాధార‌ణంగా హెచ్‌.పైలోరి బాక్టీరియా వ‌ల్ల అల్స‌ర్లు వ‌స్తే.. అవి ముదిరితే క్యాన్స‌ర్ల‌కు కూడా దారితీస్తాయ‌ని సైంటిస్టులు తెలిపారు. క‌నుక నిత్యం వాల్‌న‌ట్స్ ను తీసుకోవ‌డం వ‌ల్ల అల్స‌ర్ల‌తోపాటు క్యాన్స‌ర్‌ల ముప్పు కూడా ఉండ‌ద‌ని సైంటిస్టులు తెలిపారు. ఈ మేర‌కు సైంటిస్టుల ప‌రిశోధ‌న‌ల తాలూకు వివ‌రాల‌ను క్లినిక‌ల్ బ‌యో కెమిస్ట్రీ అండ్ న్యూట్రిష‌న్ అనే జ‌ర్న‌ల్‌లోనూ ప్ర‌చురించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version