లోక్ సభ ఎన్నికల తుది పోలింగ్ శాతాన్ని ప్రకటించిన ఈసీ

-

లోక్ సభ ఎన్నికల తుది పోలింగ్ శాతాన్ని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ వెల్లడించారు. రాష్ట్రంలో 65.67 శాతం పోలింగ్ నమోదు అయినట్లు మంగళవారం అధికారికంగా ప్రకటించారు.2019 లోక్ సభ ఎన్నికలతో పోలిస్తే ఈ సారి తెలంగాణలో 3 శాతం పోలింగ్ పర్సంటేజ్ పెరిగిందని , అత్యధికంగా భువనగిరి పార్లమెంట్‌లో 76.78 శాతం ,అత్యల్పంగా హైదరాబాద్‌ లోక్ సభ సెగ్మెంట్లో 48.48 శాతం పోలింగ్ శాతం నమోదు అయ్యిందని వెల్లడించారు.

పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా నమోదైన పోలింగ్ శాతం:

భువనగిరి= 76.78

హైదరాబాద్= 48.48

ఆదిలాబాద్= 74.03

పెద్దపల్లి= 68.87

కరీంనగర్= 72.54

మహబూబ్ నగర్= 72.43

నాగర్ కర్నూల్= 69.46

నల్లగొండ= 74.02

వరంగల్= 68.86

నిజామాబాద్= 71.92

జహీరాబాద్= 74.63

మెదక్= 75.09

మల్కాజిగిరి= 50.78

సికింద్రాబాద్= 49.04

చేవేళ్ల= 56.50

మహబూబాబాద్= 71.85

ఖమ్మం= 76.09

Read more RELATED
Recommended to you

Latest news