ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్‌ కేంద్ర పాలిత ప్రాంతం అయ్యే అవకాశం లేదు : రేవంత్ రెడ్డి

-

జూన్ 2 వరకే హైదరాబాద్ తెలంగాణ రాజధానిగా ఉంటుందని.. ఆ తర్వాత హైదరాబాద్‌ను బీజేపీ కేంద్ర పాలిత ప్రాంతం చేస్తుందంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే .ఈ మేరకు బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఒప్పందం కుదిరిందని కేటీఆర్ ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో కేటీఆర్ వ్యాఖ్యలపై తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. మంగళవారం మీడియాతో ప్రతినిధులతో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేస్తారంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు సరికాదని అన్నారు.

ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేసే అవకాశమే లేదని రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. హైదరాబాద్‌ను రెండో రాజధానిగా చేసినా రాష్ట్ర ఆదాయం ఏం తగ్గదని ఆయన అన్నారు.రానున్న వర్షాకాలంలో గోదావరి, కృష్ణా జలాలను ప్రణాళికాబద్ధంగా వాడుకోవడంపైనా చర్చలు జరిపారు.ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టులో కీలక భాగాలుగా ఉన్న మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీలకు రిపేర్ వర్క్స్ చేయాల్సిన దృష్ట్యా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చేసిన సిఫారసులు, వర్షాలు కురిసే లోపే మరమ్మత్తు పనులు పూర్తయ్యి నీటిని నిల్వ చేసుకుని, పంపింగ్ ద్వారా ఎగువకు పంపి రిజర్వాయర్లలోకి పంపడంపైనా అధికారులతో సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్‌రెడ్డి రివ్యూ చేయనున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news