ఇప్పుడు తెలుగులో ఈకోర్ట్స్ సర్వీసెస్ యాప్..!

-

ఇప్పుడు మన తెలుగులో కూడా ఈకోర్ట్స్ సర్వీసెస్ యాప్ ని ఉపయోగించ వచ్చు. అయితే ఈ కోర్ట్స్ సర్వీసెస్ యాప్ వల్ల ఎటువంటి లాభాలు మనం పొందవచ్చు..?, ఎలా మనం ఉపయోగించ వచ్చు వంటి విషయాలు కూడా తెలుసుకుందాం.

సాధారణంగా మనం మనకి నచ్చిన యాప్స్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీనివల్ల సులువుగా మనం దాని వలన కలిగే బెనిఫిట్స్ ని పొందవచ్చు. అదేవిధంగా ఈ కోర్ట్స్ ఆప్ ని కూడా మనం డౌన్లోడ్ చేసుకుని సులువుగా దీని వల్ల కలిగే ప్రయోజనాలు పొందవచ్చు.

ఈ కోర్ట్స్ సర్వీసెస్ యాప్ వల్ల ఎటువంటి ప్రయోజనాలు పొందవచ్చు అనేది చూస్తే… ప్రస్తుతం కోర్టు లో నడుస్తున్న కేసుల పరిస్థితిని ఈ కోర్ట్ సర్వీసెస్ యాప్ లో మనం తెలుసుకో వచ్చు. అది కూడా మనకి నచ్చిన భాషలో.

తెలుగు తో పాటుగా ఇప్పటికే 14 ప్రధాన భాషల్లోకి సుప్రీం కోర్టు అందుబాటులోకి ఈ యాప్ ని తీసుకు రావడం జరిగింది. అదే విధంగా ప్రజలు, న్యాయవాదులు, పోలీసులు, పిటిషనర్లు, ప్రభుత్వ సంస్థలు కేసులు స్థితిగతుల్ని సులభంగా తెలుసుకోవడానికి ఈ యాప్ మనకి ఉపయోగ పడుతుంది.

ఇప్పటికె ఈ యాప్ ని 57 లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నట్లు కేంద్ర న్యాయ శాఖ తెలిపింది. ఈ యాప్ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని ముఖ్యంగా కరోనా సమయం లో అందరికీ ఈ యాప్ ఈజీగా ఉంటుందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version