TSPSC పేపర్ లీక్ పై సిట్ కి లేఖ రాసిన ఈడి

-

టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ పై సిట్ కు లేఖ రాసింది ఈడి. ఈడి డిప్యూటీ డైరెక్టర్ అరుణ్ కుమార్ పేరుతో సిట్ కి లేఖ రాశారు. టిఎస్పిఎస్సి కేస్ కు సంబంధించి 8 అంశాల డాక్యుమెంట్స్ తమకు ఇవ్వాలని సిట్ ని కోరింది ఈడి. మీడియా కథనాలు, పబ్లిక్ డొమైన్ లో ఉన్న సమాచారం, ఇంటలెన్స్ ద్వారా వచ్చిన ప్రాథమిక వివరాల కేంద్రంగా ఈసీఐఆర్ నమోదు చేసింది ఈడి.

అసిస్టెంట్ డైరెక్టర్ సుమిత్ సింగ్ పేరుతో నాంపల్లి కోర్ట్ లో ఈడి పిటిషన్ దాఖలు చేసింది. పిఎంఎల్ ఏ సెక్షన్ 50 కింద ప్రవీణ్, రాజశేఖర్ స్టేట్మెంట్స్ రికార్డ్ చేయనుంది ఈడి. చంచల్గూడా లో ఉన్న నిందితులు ప్రవీణ్, రాజశేఖర్ లను నలుగురు అధికారులతో కూడిన బృందం విచారిస్తుందని కోర్టుకు తెలిపిన ఈడి.

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ లో మనీ లాండరింగ్ జరిగినట్టు ఈడి అభియోగం మోపింది. సెక్షన్ 48, 49 కింద ఈడి కి విచారించే అర్హత ఉందని..జైల్ లో విచారణ సందర్భంగా లాప్ టాప్, ప్రింటర్, ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించాలని కోరుతు ఈడి పిటిషన్ దాఖలు చేసింది. జైల్ లో విచారణ సందర్భంగా తగిన ఏర్పాట్లు చేయాలని చంచల్గూడా సూపరిడెంట్ కు ఆదేశాలు ఇవ్వాలని కోరింది ఈడి.

Read more RELATED
Recommended to you

Latest news