మొదటి సూర్యగ్రహణం ఈ సంవత్సరం ఏప్రిల్ 20న కనపడబోతోంది. సూర్యగ్రహణం ఉదయం ఏడు గంటలకి మొదలయ్యి మధ్యాహ్నం 12 :29 కి ముగుస్తుంది ఈ సూర్యగ్రహణం అమావాస్య తిధి నాడు ఏర్పడబోతోంది. ఈ గ్రహణం ఏఏ చోట్ల కనపడబోతోంది..? మన ఇండియాలో కూడా కనబడబోతోందా అనే విషయాలని ఇప్పుడు చూద్దాం. భారతదేశంలో సూర్యగ్రహణం కనపడదు. సూర్యగ్రహణం న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఆగ్నేషియా, దక్షిణ హిందూ సముద్రం, అంటార్టిక, మొదలైన ప్రాంతాల్లో కనపడబోతోంది.
2023 లో మొత్తం నాలుగు గ్రహణాలు..
2023 లో మొత్తం నాలుగు గ్రహణాలు ఉన్నాయి అందులో రెండు చంద్రగ్రహణాలు రెండు సూర్యగ్రహణాలు. భూమికి సూర్యుడికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఆ సమయంలో భూమి మీద వారికి సూర్యుడు పూర్తిగా లేదా పాక్షికంగా కనిపించడు. ఈ ప్రకియ మీద ప్రాచీన హిందూ మతంకు సంబంధించిన సూర్య సిద్ధాంతం లో కూడా చెప్పారు. ఖగోళ శాస్త్రవేత్తలు కూడా ధ్రువీకరించారు. ఇక రెండో సూర్య గ్రహణం విషయానికి వస్తే.. రెండోది అక్టోబర్ 14న కనిపించనుంది. అలానే ఈ ఏడాది తొలి చంద్ర గ్రహణం మే 5న కాగా.. రెండోది అక్టోబర్ 28న కనపడనుంది.
ఏప్రిల్ 20 న ఇండియా లో..
ఏప్రిల్ 20 న కేవలం న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఆగ్నేయాసియా, అంటార్కిటికా, దక్షిణ హిందూ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్ర ప్రాంతాల్లోనే ఉంటుంది. మన ఇండియా లో కనపడదు. సో గ్రహణం లేదు. ఎలాంటి నియమాలని పాటించక్కర్లేదు.