ఎడిట్ నోట్: పొత్తుపై ఎత్తులు..!

-

ఏపీలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి…ఎప్పుడైతే అధికార వైసీపీ…ప్రతిపక్షాలని దెబ్బతీసే విధంగా రాజకీయం చేయడం మొదలుపెట్టిందో అప్పటినుంచి సమీకరణాలు మారుతున్నాయి..ప్రతిపక్షాలని ఏకం చేసేలా వైసీపీ చేస్తుందా? అనే పరిస్తితి ముందుకొచ్చింది. ముఖ్యంగా టీడీపీ-జనసేన కలవడం. గత ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు విడివిడిగా పోటీ చేయడం వల్ల ఓట్లు చీలిపోయి వైసీపీకి లాభం జరిగింది. వాస్తవానికి రెండు పార్టీల పొత్తులో పోటీ చేసిన వైసీపీ అధికారంలోకి వచ్చేదేమో గాని..151 సీట్లు మాత్రం గెలిచేది కాదని చెప్పవచ్చు.

కానీ టీడీపీ-జనసేన పొత్తు వల్ల కనీసం 50 పైనే సీట్లు అయిన గెలుచుకునేవి. అంటే జనసేన ఓట్లు చీల్చడం వల్ల దాదాపు 40 స్థానాల వరకు వైసీపీ ఎక్స్‌ట్రా గెలుచుకోగలిగింది. అంటే పొత్తు ప్రభావం ఉందని చెప్పవచ్చు. ఇక వైసీపీ అధికారంలోకి వచ్చాక..ఆ పార్టీ చేసే రాజకీయం వల్ల చంద్రబాబు-పవన్ కలవాల్సిన పరిస్తితి వచ్చింది. ఒకసారి విశాఖలో పవన్‌ కార్యక్రమాలకు వైసీపీ ప్రభుత్వం బ్రేక్ వేసింది..దీంతో బాబు..పవన్‌ని కలిసి సంఘీభావం తెలిపారు. ఇటు రోడ్లపై సభలు, ర్యాలీ

లు చేయకూడదని జీవో తెచ్చి..వైసీపీ ఏమో యధేచ్చగా రోడ్లపై సభలు, ర్యాలీలు నిర్వహిస్తూ..ప్రతిపక్ష నేత చంద్రబాబు కుప్పంకు వెళితే..అక్కడ అడుగడుగున ఆంక్షలు పెట్టారు. దీంతో పవన్ వచ్చి..బాబుని కలిసి సంఘీభావం తెలిపారు. అంటే వైసీపీ చేసే కార్యక్రమాల వల్లే పదే పదే బాబు-పవన్ కలుస్తున్నారు. చివరికి పొత్తు దిశగా వారు ముందుకెళుతున్నారు.

కాకపోతే అధికారికంగా పొత్తు పై మాట్లాడటం లేదు గాని…ఉమ్మడిగా వైసీపీ అరాచకాలపై పోరాటం చేస్తామని అంటున్నారు. ఇక వీరు కలిసిన వెంటనే..వరుసపెట్టి వైసీపీ నేతలు ప్రెస్ మీట్లు పెట్టి..బాబు-పవన్‌పై విరుచుకుపడుతున్నారు. ఓ వైపు బాబు-పవన్ కలిస్తే జగన్‌కే లాభమని చెబుతూనే..పవన్ ప్యాకేజ్‌కు అమ్ముడుపోయారని, బాబుకు బానిసత్వం చేస్తున్నారని, కాపుల ఓట్లని తాకట్టు పెడుతున్నారని, బాబు కోసం పవన్ పార్టీ పెట్టారని..ఇలా రకరకాలుగా విమర్శలు చేస్తున్నారు.

అంటే టీడీపీ-జనసేన పొత్తుతో ముందుకొస్తే దాన్ని చిత్తు చేసేలా వైసీపీ పై ఎత్తులు వేస్తూ..పరోక్షంగా జనసేనకు సపోర్ట్ ఇచ్చి కాపుల ఓట్లని టీడీపీకి పడకూడదని, మళ్ళీ వైసీపీకి పడేలా రాజకీయం నడిపిస్తున్నట్లు ఉన్నారు. అదేవిధంగా పరోక్షంగా పొత్తు లేకుండా చేయడమే వైసీపీ టార్గెట్‌గా కనిపిస్తోంది. మరి చూడాలి వారి పొత్తు సఫలమవుతుందో..వీరి ఎత్తులు ఫలిస్తాయో.

Read more RELATED
Recommended to you

Exit mobile version