ఎడిట్ నోట్ : అన్ని అన‌ర్థాల‌కూ కార‌ణం బీజేపీ ? కాంగ్రెస్ చెబితే వినాలి !

-

రెండంటే రెండు పార్టీలు
రెండంటే రెండు బ‌లీయ‌మైన శ‌క్తులు
దేశాన్ని న‌డిపిస్తున్నాయి తిరుగులేని శ‌క్తిగా
అవ‌త‌రించే క్ర‌మాన ఒక‌దానిపై మ‌రొక‌టి పైచేయి సాధిస్తోంది
ఆ విధంగా కాంగ్రెస్ ఆ విధంగా బీజేపీ ఈ యుద్ధంలో త‌ల‌ప‌డుతున్నాయి
త‌ల‌పండిన నేత‌లున్న కాంగ్రెస్ కు కార్పొరేట్ శక్తుల అండ‌తో ఉన్న బీజేపీకి మ‌ధ్య
ఉన్న తేడా ఏంటి? మోడీ హ‌వా ఇప్ప‌ట్లో త‌గ్గ‌దు అంటే అందుకు కార‌ణంగా ఆయ‌న చ‌రిష్మానేనా!

రెండు ద‌శ‌ల్లో దేశాన్ని పాలించే శ‌క్తిగా అవ‌త‌రించింది కాంగ్రెస్. ఇదే స్థాయిలో రెండు విడత‌లుగా దేశాన్ని పాలించే శ‌క్తిని అందుకుంది బీజేపీ. కాంగ్రెస్ హ‌యాంలో ఉన్న స్కాంల గోల ఇప్ప‌టికీ అంతు ప‌ట్ట‌డం లేదు. ఆశ్చ‌ర్యం ఏంటంటే బీజేపీలో కూడా నేరు నేరారోప‌ణ‌లు ఉన్న ప‌నులు చాలానే జ‌రిగాయి. జ‌రుగుతున్నాయి కానీ అవేవీ వెలుగులోకి రావ‌డం లేదు. దీంతో ఆ రోజు వెలుగులోకి వ‌చ్చిన ఆర్థిక నేరాలు అన్నీ కాంగ్రెస్ ను చీక‌టి కొట్టానికే ప‌రిమితం అయ్యేలా చేశాయి. ఓ విధంగా కాంగ్రెస్ కు చావు దెబ్బ కొట్టాయి.

కానీ ఇప్పుడున్న ప‌రిస్థితుల నేప‌థ్యంలో కాంగ్రెస్ క‌న్నా బీజేపీ నే స‌మ‌ర్థ నాయ‌క‌త్వంను దేశానికి అందిస్తుంద‌న్న వాద‌న ఒక‌టి స్థిరం చేసేందుకు మోడీ చేసిన ప్ర‌య‌త్నాలు స‌ఫ‌లీకృతం అవుతున్నాయి. 2జీ స్పెక్ట్రం కుంభ‌కోణం కానీ బొగ్గు కుంభ‌కోణం కానీ ఇంకా చాలా విష‌యాల్లో కాంగ్రెస్ నాయ‌కుల అవినీతి సంబంధిత కూట‌మిలో ఉన్న పార్టీల నాయ‌కుల అవినీతి హ‌ద్దు దాటింద‌న్న వాద‌న‌కు ఆధారాలు ఉన్నాయి.

ఆధారాల‌తో కూడిన ప‌నులు చాలా వెలుగులోకి వ‌చ్చాక కాంగ్రెస్ తో స‌హా యూపీఏ భాగ‌స్వామ్య ప‌క్ష పార్టీలు అన్నీ ఇంటి బాట ప‌ట్టాయి. సోనియా కూడా అలానే పూర్తిగా తెర‌మ‌రుగయ్యారు. మ‌న్మోహ‌న్ లాంటి ఆర్థిక వేత్త‌లు ప్ర‌ధానిగా ఉన్నా కూడా చేసిందేమీ లేద‌ని తేలిపోయింది. కానీ ఇప్పుడు ఎన్డీఏ సీన్ లో ఉంది.ఇంకా చెప్పాలంటే బీజేపీనే ప్ర‌బ‌ల శ‌క్తిగా ఎదిగి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవ‌త‌రించి దేశాన్ని ఏలుతోంది.దేశాన్ని ఏలే పాల‌వ‌ర్గానికి అవ‌స‌రం అయినంత శ‌క్తిని ఇస్తోంది.

కానీ యూపీఏ చేసిన‌న్ని త‌ప్పులు ఎన్డీఏ చేయ‌లేదు.లేదా చేసినా దొర‌క‌డం లేదు. ఆ విధంగా మోడీ అనే శ‌క్తి దేశ భ‌క్తి అనే పెద్ద ఆయుధాన్ని త‌న వంతుగా వాడుకుంటున్నారు.దేశాన్ని పాలించే క్ర‌మంలో ఆయ‌న ఎదురులేని నాయ‌కుడు అవుతున్నారు. ఆ కార‌ణంగా బీజేపీ క‌న్నా కాంగ్రెస్ వెనుకంజ‌లో ఉంది. త‌ప్పులు దిద్దుకోవ‌డం చేత‌గాని కాంగ్రెస్ కు ఇప్ప‌టికిప్పుడు దేశంలో మ‌ళ్లీ పూర్వ వైభ‌వం ద‌క్కించుకోవ‌డం క‌ష్ట‌మేన‌ని అంటోంది బీజేపీ. క‌నుక త‌ప్పుల‌న్నీ త‌మ‌వే అని చెప్ప‌డం త‌ప్పు అని అంటోంది బీజేపీ.

– ర‌త్న‌కిశోర్ శంభుమ‌హంతి శ్రీ‌కాకుళం దారుల నుంచి…

Read more RELATED
Recommended to you

Exit mobile version