చిన జీయర్ స్వామిని మరోసారి టార్గెట్ చేసింది సీతక్క. మెదక్ జిల్లా తూప్రాన్ లో నిర్వహిస్తున్న సర్వోదయ సంకల్ప యాత్ర లో ములుగు ఎమ్మెల్యే సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన జర్నలిస్టుల సమస్యలు ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారని..జర్నలిస్టులకు హెల్త్ కార్డు తో పాటు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరుపేదలకు భూతాల ఉద్యమంలో భూములు పంచితే తెలంగాణ ప్రభుత్వం నిరుపేదల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుందని,, నిప్పులు చెరిగారు. చిన జీయర్ స్వామి లాంటి వారిని కేసీఆర్ నెత్తిన పెట్టుకున్నారని ఆగ్రహించారు.
నిరుపేదల భూములు లాక్కొని ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తున్నారని… వ్యవసాయం చేసుకునేందుకు నిరు పేదలకు భూములు లేకుండా పోతున్నాయని ఫైర్ అయ్యారు. మద్యం ద్వారా వచ్చిన డబ్బులతో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని.. మద్యం సేవించి యువత పెడదారిన పడి తమ కుటుంబాలను నాశనం చేసుకుంటున్నారన్నారు. ప్రభుత్వ మద్యం అమ్మకాలపై నియంత్రణ పెట్టాలని డిమాండ్ చేశారు.