ఎడిట్ నోట్: కల్యాణ్‌కు హైప్..!

-

ఏపీలో రాజకీయం వైసీపీ వర్సెస్ పవన్ అన్నట్లు జరుగుతుంది. అయితే ఇది ఆటోమేటిక్ గా జరుగుతుందా? లేక వైసీపీ పక్కా వ్యూహంతో పవన్‌ని టార్గెట్ చేసి..టీడీపీని దెబ్బ తీసి పవన్‌కు హైప్ ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారా? అనే డౌట్ విశ్లేషకులు వస్తుంది..అటు టి‌డి‌పి శ్రేణులు సైతం ఇదే అనుమానిస్తున్నారు. అయితే ఏది ఎలా జరిగిన గత కొన్ని రోజుల నుంచి పవన్ వర్సెస్ వైసీపీ అనే విధంగా పోరు నడుస్తుంది.

ఈ పోరులో పవన్ వాలంటీర్లని టార్గెట్ చేయడం సంచలనమైంది. రాష్ట్రంలో పలువురు మహిళలు మిస్ అవ్వడానికి కారణం వాలంటీర్లు అని, ప్రతి కుటుంబంలో ఎంతమంది మహిళలు ఉంటున్నారో ఆ సమాచారాన్ని సేకరించి వాలంటీర్లు..సంఘ విద్రోహ శక్తులకు ఇస్తున్నారని ఆరోపించారు. అలాగే ఏపీ ప్రజల డేటాని సేకరించి హైదరాబాద్ లోని ఓ కంపెనీకి ఇచ్చారని అన్నారు. అయితే ఇలా వాలంటీర్లపై పవన్ ఆరోపణలు చేయడంతో..వైసీపీ మరింత ఎక్కువగా పవన్‌ని టార్గెట్ చేసింది. ఇటు వాలంటీర్లు నిరసనలు తెలియజేస్తూ..పవన్ పై పోలీసులకు ఫిర్యాదులు చేశారు.

ఈ క్రమంలో వాలంటీర్లపై నిరాధార ఆరోపణలు చేశారంటూ పవన్‌కల్యాణ్‌పై ప్రాసిక్యూషన్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఆయనపై కేసు నమోదు చేసేందుకు గ్రామ/వార్డ్‌ సచివాలయాల శాఖకు అనుమతి ఇచ్చింది.     ఈ మేరకు ప్రభుత్వం జీవో విడుదల చేసింది. అయితే ఈ కేసు పెద్దగా శిక్ష పడే కేసు కాదు..కానీ ఈ విషయం పక్కన పెడితే..ఇలా కేసులు పెట్టడం వల్ల..పవన్‌ గ్రాఫ్ పెంచుతున్నారా? అనే డౌట్ వస్తుంది.

కేసులు అంటే చాలు వైసీపీ అక్రమంగానే కేసులు పెడుతుందనే భావన ఎక్కువ వస్తుంది. దీని వల్ల ప్రజల్లో పవన్ పై సానుభూతి ఇంకా పెరుగుతుంది. అప్పుడు జనసేన బలం పెరుగుతుంది. అలా జనసేన బలం పెంచి టి‌డి‌పిని దెబ్బతీయడమే వైసీపీ టార్గెట్ గా ఉందనే అనుమానం టి‌డి‌పి శ్రేణుల్లో ఉంది. దీని ద్వారా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు ఎక్కువ చీలడం..ఒకవేళ పొత్తు ఉన్నా సరే పవన్..ఎక్కువ డిమాండ్లు చేసేలా రాజకీయం..చివరికి పొత్తు చెడగొట్టడమే వైసీపీ టార్గెట్ అంటున్నారు. మరి ఈ రాజకీయం వెనుక ఎలాంటి కోణం ఉందో.

Read more RELATED
Recommended to you

Exit mobile version