తెలంగాణలో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. హైదరాబాదులో బుధవారం రాత్రి నుంచి గురువారం సాయంత్రం వరకు ఏకంగా 188.3MM వర్షం కురిసింది. గత 30 ఏళ్లలో జూలై నెల సగటు వర్షపాతం 162MM కాగా, ఈ సారి 24 గంటల్లోనే దానికి మించి వర్షం పడింది.
మియాపూర్ లో వాన కురిసింది. 2012 జూలై నెలలో అత్యధికంగా 115MM వర్షపాతం నమోదయిందని అధికారులు తెలిపారు. కాగా, మరో రెండు రోజులు భారీ వర్షం కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
కాగా, తెలంగాణలో మరో ఐదు రోజులు వర్షాలు పడతాయని…ముఖ్యంగా శుక్ర, శనివారాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రంలోని నాలుగు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. క్షేత్రస్థాయిలో ఎన్డిఆర్ఎఫ్ బలగాలు సిద్ధంగా ఉన్నాయి.