ఎడిట్ నోట్: పవన్ ‘సీఎం’ త్యాగం..జనసేన ఓట్లు ఎటు?

-

మొత్తానికి సీఎం సీటుని పవన్ కల్యాణ్ త్యాగం చేసేశారు. తమకు పూర్తి బలం లేకుండా సి‌ఎం సీటు డిమాండ్ చేయడం గాని..అలా అని టి‌డి‌పి వాళ్ళు సి‌ఎం సీటు ఇస్తారని అనుకోవడం కరెక్ట్ కాదని చెప్పేశారు. ఒకవలే బలం నిరూపించుకుంటే అప్పుడు సి‌ఎం సీటు అడగడానికి సరిపోతుందని అన్నారు. వాస్తవానికి ఎప్పటినుంచో టి‌డి‌పి-జనసేన పొత్తు అంశం నడుస్తుంది..ఇప్పటికే చంద్రబాబు, పవన్ పలుమార్లు కలిశారు. పొత్తుపై మాట్లాడుకున్నారు. కానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.

కాకపోతే దాదాపు పొత్తు ఫిక్స్ అని అర్ధమవుతుంది. కానీ పొత్తులో ఎవరికి ఎన్ని సీట్లు ఏంటి అనేది క్లారిటీ లేదు. అదే సమయంలో పవన్‌కు సి‌ఎం సీటు ఇస్తేనే టి‌డి‌పితో పొత్తు అని జనసేన శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి. అలాగే జనసేన శ్రేణులని..వైసీపీ శ్రేణులు సైతం రెచ్చగొట్టి..పవన్ కు సి‌ఎం సీటు ఇచ్చేలా డిమాండ్ చేయాలని రాజకీయం నడుపుతున్నాయి. సరే ఏదేమైనా గాని పొత్తు ఉంటే పవన్‌కు సి‌ఎం సీటు ఇవ్వాలనే డిమాండ్ ఉంది. కానీ లెక్కల ప్రకారం చూసుకుంటే పవన్ కు సి‌ఎం సీటు టి‌డి‌పి ఇవ్వదు. అందులో ఎలాంటి డౌట్ లేదు.

ఎందుకంటే గత ఎన్నికల గణాంకాలు చూసుకుంటే..టి‌డి‌పికి 40 శాతం ఓట్లు వస్తే..జనసేనకు 7 శాతం ఓట్లు వచ్చాయి. కాబట్టి పెద్ద పార్టీ టి‌డి‌పినే కాబట్టి..సి‌ఎం సీటు పవన్‌కు ఇవ్వరు. కానీ జనసేన శ్రేణులు మాత్రం డిమాండ్ చేస్తున్నాయి. ఇలాంటి సమయంలోనే పవన్ ఎంట్రీ ఇచ్చి..వైసీపీని గద్దె దించడానికి ఖచ్చితంగా పొత్తులు ఉంటాయని, కానీ సి‌ఎం సీటు లేదనే చెప్పేశారు.

ఎందుకంటే తనని సీఎం చేయాలని టీడీపీ, బీజేపీ వాళ్లు ఎందుకంటారు? అని ప్రశ్నిస్తూనే..వాళ్ల నోటి నుంచి ఒక్క మాట కూడా రాదని, ఇక వారి స్థానంలో తానున్నా అననని, మన బలం చూపించి, సత్తా చాటి పదవులు తీసుకోవాలని, కండిషన్లు పెడితే జరిగేది కాదని అన్నారు.   2019లో 137స్థానాల్లో పోటీచేసినప్పుడు కనీసం 30-40 స్థానాల్లో జనసేన గెలిచి ఉండాలని, అలా జరగలేదని, కాబట్టి సి‌ఎం సీటు డిమాండ్ లేనట్లే అని పవన్ పరోక్షంగా చెప్పారు. ఇదే అదనుగా వైసీపీ..పవన్..తన అభిమానులని , కాపు ఓట్లని చంద్రబాబుకు తాకట్టు పెట్టేశారని కామెంట్స్ చేస్తున్నారు. మరి పవన్‌కు సి‌ఎం సీటు లేని నేపథ్యంలో జనసేన శ్రేణుల ఓట్లు టి‌డి‌పికి పడతాయా? లేక వైసీపీ వైపుకు వెళ్తాయో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version