ఎడిట్ నోట్: రేవంత్-లోకేష్..సేమ్ కాన్సెప్ట్.!

-

సరిగ్గా రేవంత్ రెడ్డి టి‌పి‌సి‌సి అధ్యక్షుడు అయిన మొదట్లో ఏం జరిగిందో ఒక్కసారి గుర్తు చేసుకుంటే..రేవంత్ వరుసపెట్టి..కొందరు మీడియా అధిపతులని కలిశారు..టీవీ5, ఈనాడు, ఏబీఎన్ అధినేతలని కలిశారు..పి‌సి‌సి అధ్యక్షుడు అయిన నేపథ్యంలో తనకు మద్ధతు ఉండాలనే విధంగా వారిని కోరారు. ఈ మీడియా సంస్థలు టీడీపీకి అనుకూలమైనవి అనే ముద్ర ఉంది. ఇదే క్రమంలో రేవంత్,  ఏబీఎన్ రాధాకృష్ణని కలిసినప్పుడు..వారి మధ్య జరిగిన చర్చ బయటకొచ్చిన విషయం తెలిసిందే. ఏపీలో లోకేష్, తెలంగాణలో నువ్వు బాగా తిరగాలని..కవరేజ్ ఇచేస్తామని చెప్పి రాధాకృష్ణ, రేవంత్ చెబుతున్న వీడియో బయటకొచ్చింది. అలాగే పాదయాత్రలు చేయాలనే సలహా కూడా ఇచ్చినట్లు తెలిసింది.

అయితే అప్పుడు జరిగిన చర్చ..ఇప్పుడు నిజమవుతుంది. అటు ఏపీలో లోకేష్, ఇటు తెలంగాణలో రేవంత్ రెడ్డి పాదయాత్రలకు రెడీ అవుతున్నారు. జనవరి 26 నుంచి రేవంత్ తెలంగాణలో పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. అటు లోకేష్ జనవరి 27 నుంచి పాదయాత్ర చేయనున్నారు. ఇక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకోచ్చి..మళ్ళీ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని చెప్పి రేవంత్ ప్రయత్నిస్తున్నారు. కానీ సీనియర్ నేతలతో ఉన్న అంతర్గత విభేదాలు వల్ల పార్టీ బలోపేతంపై పెద్దగా ఫోకస్ చేయలేకపోతున్నారు.

ఇక ఇప్పుడు పాదయాత్ర ద్వారా ముందుకు రానున్నారు. జనవరి 26 నుంచి జూన్ 2 వరకు రేవంత్ పాదయాత్ర కొనసాగుతుంది. భద్రాచలంలో రేవంత్ పాదయాత్ర మొదలు కానుందని తెలుస్తోంది. మరి రేవంత్ పాదయాత్ర వల్ల కాంగ్రెస్ బలపడుతుందో లేదో చూడాలి. ఇటు ఏపీలో టీడీపీకి పూర్వ వైభవం తీసుకొచ్చి..పార్టీని అధికారంలోకి తీసుకురావాలని లోకేష్ పాదయాత్ర చేయడానికి రెడీ అవుతున్నారు. జనవరి 27న కుప్పంలో లోకేష్ పాదయాత్ర మొదలవుతుంది. 400 రోజుల పాటు 4 వేల కిలోమీటర్లు పాదయాత్ర కొనసాగుతుంది.

అంటే ఇటు రేవంత్, అటు లోకేష్..ఇద్దరు నేతలు దాదాపు ఒకేసారి పాదయాత్ర మొదలుపెట్టనున్నారు..అలాగే వారిద్దరు ఇబ్బందుల్లో ఉన్న తమ పార్టీలని అధికారంలోకి తీసుకురావాలని చూస్తున్నారు. మరి చూడాలి ఈ ఇద్దరు పాదయాత్రలు ఏ స్థాయిలో సక్సెస్ అవుతాయో..

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version