తెలంగాణ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అభయహస్తం పేరుతో మేనిఫెస్టో ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వేదికపైన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణాలో మీరు ఓటేసి కాంగ్రెస్ ను గెలిపిస్తే మేము రైతు బంధు ను తీసేస్తామని కేసీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారు, కానీ ఈ పథకం స్థానంలోకి రైతు భరోసా అన్నది వచ్చి చేరుతుంది అంటూ రేవంత్ రెడ్డి చెప్పారు. కాంగ్రెస్ గెలిస్తే రైతు భరోసా పథకం కింద కౌలు రైతులు అందరికీ రూ. 15 వేలు చొప్పున అందిస్తామన్నారు రేవంత్ రెడ్డి. ఇక ఇప్పటికే బ్యాంకు లలో వ్యవసాయం మీద తెచ్చి అప్పులు మీకు ఉంటే ఎవ్వరూ కట్టడానికి ప్రయత్నించవద్దు, మేము గెలవగానే అన్ని రుణాలను మాఫీ చేసేస్తాం అంటూ రేవంత్ రెడ్డి రైతులకు శుభవార్తను అందించారు.
అంతే కాకుండా ఆరోగ్య శ్రీని మహా యజ్ఞంగా తీసుకుని రూ.10 లక్షల వరకు అమలు అయ్యేలా చర్యలు తీసుకుంటామంటూ ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రజలకు తెలియచేశారు.