ఆ మాటలతోనే ఈటెల ఇబ్బందులు తెచ్చుకున్నారా…?

తెలంగాణాలో ఈటెల రాజేంద్ర వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఈటెల రాజేంద్ర దెబ్బకు ఏం జరుగుతుంది అధికార పార్టీలో అనే అంచనాలు కూడా పెరుగుతున్నాయి. ఇక ఇటీవల ఈటెల చేసిన వ్యాఖ్యలే ఆయన కొంప ముంచాయని అంటున్నారు. ఇటీవల మంత్రి ఈటెల రాజేందర్‌ చేసిన వ్యాఖ్యలు చూస్తే… కులం, డబ్బు, పార్టీ జెండాను కాదు, మనిషిని గుర్తు పెట్టుకోవాలి అని ఆయన మాట్లాడారు.etala-rajender

ధర్మం, న్యాయం తాత్కాలికంగా ఓడిపోవచ్చు కానీ శాశ్వతంగా ఓడిపోదు అని, నేను గాయపడినా నా మనసు మార్చుకోలేదు అని స్పష్టం చేసారు. 20 ఏళ్ల ప్రస్థానంలో నన్ను ఎంతో ఎత్తుకు తీసుకెళ్లారు అని చెప్పుకొచ్చారు. పెట్టిన చెయ్యి ఆగదు, చేసే మనిషినీ ఆగను అని అన్నారు.