దేశానికి కేసీఆర్ లాంటి నాయ‌కులు కావాలి : శ‌ర‌ద్ ప‌వ‌ర్

-

దేశానికి కేసీఆర్ వంటి మ‌హా నాయ‌కుడు అవ‌స‌రం అని ఎన్సీపీ అధినేత శ‌ర‌ద్ ప‌వ‌ర్ అన్నారు. ప్ర‌స్తుతం దేశంలో అనేక స‌మ‌స్య‌లు ఉన్నాయని ఆయ‌న అన్నారు. నిరుద్యోగం, ఇంద‌న స‌మ‌స్య‌ల తో పాటు చాలా స‌మ‌స్య‌లు దేశాన్ని ప‌ట్టి పీడిస్తున్నాయ‌ని ఆయ‌న అన్నారు. ప్ర‌స్తుతం కేంద్రంలో ఉన్న మోడీ స‌ర్కార్.. దాదాపు అన్ని రంగాల్లో విఫ‌లం అవుతుంద‌ని అన్నారు. ప్ర‌భుత్వ సంస్థ‌ల‌ను అన్నింటినీ అమ్మెస్తోంద‌ని విమ‌ర్శించారు. అలాగే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుంద‌ని అన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ పాల‌న బాగుంద‌ని అన్నారు. సంక్షేమ ప‌థ‌కాలు కూడా తెలంగాణ రాష్ట్రంలో విజ‌య వంతంగా అమ‌లు అవుతున్నాయ‌ని శ‌ర‌ద్ ప‌వ‌ర్ అన్నారు. ఇలాంటి వ్య‌క్తి దేశ రాజ‌కీయాల‌కు చాలా అవ‌సరం అని అన్నారు. అలాగే ఫెడ‌ర‌ల్ స్ఫూర్తికి కేసీఆర్ చేస్తున్న పోరాటం అద్భుతం అని అన్నారు. మోడీ పై కేసీఆర్ చేస్తున్న పోరాటానికి త‌మ పూర్తి మ‌ద్ద‌తు ఉంటుంద‌ని శ‌ర‌ద్ ప‌వ‌ర్ ప్ర‌క‌టించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version