బ్రేకింగ్: ఈటలపై విచారణ ప్రారంభం…!

నిన్న సాయంత్రం నుంచి మంత్రి ఈటల రాజేంద్ర టార్గెట్ గా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఆయన భూ కబ్జాలు చేసారు అనే ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. పౌల్ట్రీ ఫారం కోసం ఆయన వంద ఎకరాలను కబ్జా చేసారనే వార్తలు వస్తున్నాయి. అసైన్డ్ భూములను కబ్జా చేసారనే ప్రచారం జరుగుతుంది. దీనితో తెలంగాణా ప్రభుత్వం విచారణ మొదలుపెట్టింది. సిఎం కేసీఆర్ విచారణకు ఆదేశాలు ఇవ్వడంతో విచారణ మొదలు పెట్టారు.

health minister etala rajender speaks about covid condition in telangana

రెవెన్యూ అధికారులు, విజిలెన్స్ అధికారులు అచ్చంపేట గ్రామానికి చేరుకున్నారు. దీనితో భారీగా పోలీసులు మొహరించారు. రైతుల నుంచి వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. వంద ఎకరాలను ఈ గ్రామంలో ఆయన కబ్జా చేసారు అనే ప్రచారం ఉంది. దీనితో ఆయనను అరెస్ట్ చేస్తారా అనే దానిపై ఆసక్తికర చర్చ జరుగుతుంది.