నిన్న జరిగిన బీజేపీ కాబినెట్ మీటింగ్ లో తీసుకున్న నిర్ణయాల ఫలితంగా తెలంగాణ బీజేపీ చీఫ్ పదవి నుండి బండి సంజయ్ ను తొలగించి కిషన్ రెడ్డికి ఆ పదవిని ఇవ్వడం జరిగింది. ఇక ఈటల రాజేందర్ ను ఎన్నికల నిర్వహణ కమిటీకి చైర్మన్ గా ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి తో నాకు మంచి సంబంధాలు ఉన్నాయన్నారు. ఈయన సారథ్యంలో బీజేపీ తెలంగాణాలో గెలవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయన్నారు. రాష్ట్రంలో అందరినీ కలుపుకుని పోయి పార్టీ అభివృద్ధికి గట్టిగా కృషి చేస్తామన్నారు ఈటల. కాగా మీడియా అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా నాకు బండి సంజయ్ తో ఎటువంటి విభేదాలు లేవని అన్నారు. ఎవ్వరు అధ్యక్షులుగా ఉన్నా నా బాధ్యతను నేను తూచా తప్పకుండా పాటిస్తాను అన్నారు.