మనం ఉదయం తీసుకునే బ్రేక్‌ఫాస్ట్ ఎంత హెల్దీగా ఉంటే అంత మంచిదని వైద్యులు చెబుతుంటారు. అందుకని అందులో కోడిగుడ్లు కచ్చితంగా ఉండేలా చూసుకుంటే మనకు ఆ రోజుకు కావల్సిన పోషకాలన్నీ లభిస్తాయి.
మనం ఉదయం తీసుకునే బ్రేక్‌ఫాస్ట్ ఎంత హెల్దీగా ఉంటే అంత మంచిదని వైద్యులు చెబుతుంటారు. అందుకని అందులో కోడిగుడ్లు కచ్చితంగా ఉండేలా చూసుకుంటే మనకు ఆ రోజుకు కావల్సిన పోషకాలన్నీ లభిస్తాయి. దీనికి తోడు శక్తి కూడా అందుతుంది. అయితే ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో ఎగ్స్‌తో చేసే ఎగ్ చీజ్ రోల్స్‌ను తీసుకుంటే ఇంకా మంచిది. దీంతో పోషకాలు, శక్తి రెండూ లభిస్తాయి. మరి ఈ ఎగ్ చీజ్ రోల్స్‌ను ఎలా తయారు చేయాలో, అందుకు ఏమేం పదార్థాలు కావాలో ఇప్పుడు తెలుసుకుందామా..!
ఎగ్ చీజ్ రోల్స్ తయారీకి కావల్సిన పదార్థాలు:
గుడ్లు – 2 (ఒక గిన్నెలో వేసి బాగా గిలక్కొట్టాలి)
చీజ్ – 8 చిన్న ముక్కలు
బ్రెడ్ – 8 ముక్కలు
ఉల్లిపాయ – 2 (సన్నగా కట్ చేసుకోవాలి)
కార్న్ ఫ్లోర్ – 2 టేబుల్ స్పూన్లు
అల్లం – చిన్న ముక్క (తురుముకోవాలి)
కారం – అర టీస్పూన్
చాట్ మసాలా – అర టీస్పూన్
బటర్ – 1 టేబుల్ స్పూన్
నూనె – 2 టేబుల్ స్పూన్లు
లెట్యూస్ ఆకులు – 4
ఎగ్ చీజ్ రోల్స్ తయారుచేసే విధానం:
ముందుగా లెట్యూస్ ఆకులకు కొద్దిగా బటర్ రాసి పక్కన పెట్టాలి. ఒక చిన్న పాత్ర తీసుకుని అందులో గుడ్లను పగలగొట్టి బాగా గిలక్కొట్టాలి. అందులోనే ఉల్లిపాయ, పచ్చి మిర్చి ముక్కలు, అల్లం తురుం వేసి బాగా కలుపుకోవాలి. అనంతరం అందులో చాట్ మసాలా కూడా వేసి మరోసారి బాగా కలపాలి. మిశ్రమం చిక్కగా అయ్యేలా చూసుకోవాలి. అప్పటి వరకూ బాగా కలపాలి. మిశ్రమాన్ని పక్కన పెట్టుకుని మరో పాత్ర తీసుకుని అందులో కార్న్ ఫ్లోర్ వేసి, అందులో నీళ్లు కూడా పోసి బాగా మిక్స్ చేయాలి. తరువాత బ్రెడ్ ముక్కలను తీసుకుని వాటిపై చీజ్ ముక్కలను పెట్టుకోవాలి. బ్రెడ్‌పై చీజ్ ముక్కలను పెట్టి బాగా రుద్దాక దానిపై అంతకు ముందు సిద్ధం చేసుకున్న గుడ్డు మిశ్రమాన్ని రాయాలి. అనంతరం కార్న్ ఫ్లోర్‌తో బ్రెడ్ అంచులను కవర్ చేస్తూ రోల్ చేయాలి. ఇలా అన్ని బ్రెడ్ ముక్కలను రోల్స్‌గా చేసి పక్కన పెట్టుకోవాలి. పాన్ తీసుకుని దానిపై కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. తరువాత బ్రెడ్ రోల్స్‌ను పాన్ మీద వేసి మీడియం మంటపై రోల్స్‌ను ఫ్రై చేయాలి. బంగారు గోధుమ రంగు వచ్చే వరకు రోల్స్‌ను ఫ్రై చేయాలి. ఇలా తయారైన రోల్స్‌ను టిష్యూ పేపర్‌పై వేసి అధిక నూనెను ఒత్తి తీసేయాలి. అనంతరం రోల్స్‌పై మొదట్లో సిద్ధం చేసుకున్న లెట్యూస్ ఆకులను పెట్టాలి. అంతే.. రుచికరమైన ఎగ్ చీజ్ రోల్స్ తయారవుతాయి. వాటిని టమాటా సాస్ లేదా గ్రీన్ చట్నీలలో అద్దుకుని తింటే రుచి అమోఘంగా ఉంటుంది..!