న్యూఢిల్లీ: దేశంలో వివిధ రాష్ట్రాలకు గవర్నర్లు బదిలీలు అయ్యారు. హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్‌గా ఉన్న బండారు దత్తాత్రేయను హర్యానాకు బదిలీ చేశారు. విశాఖ మాజీ ఎంపీ కంభంపాటి హరిబాబును మిజోరం గవర్నర్‌గా నియమించారు. త్రిపుర గవర్నర్‌గా సత్యదేవ్ నారాయణ్ ఆర్య. గోవా గవర్నర్‌గా శ్రీధరన్ పిళ్లై, మధ్యప్రదేశ్ గవర్నర్‌గా మంగూభాయ్ పటేల్, జార్ఖండ్ గవర్నర్‌గా రమేశ్ బైస్, కర్ణాటక గవర్నర్‌గా థావర్ చంద్ గెహ్లాట్‌ను బదిలీ చేస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీ చేశారు. త్వరలో వీరంతా వారికి కేటాయించిన రాష్ట్రాల్లో బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇద్దరు తెలుగు వాళ్లను గవర్నర్లుగా నియమించడంపై రెండు రాష్ట్రాల్లో హర్షం వ్యక్తమవుతోంది.
మరోవైపు కేంద్ర కేబినెట్ కూడా విస్తరణ జరగనుందని ప్రచారం జరుగుతోంది. పని చేయని కేంద్రమంత్రులపై వేటు వేయనున్నట్లు తెలుస్తోంది. 18మందిని కేంద్రకేబినెట్‌లోకి అవకాశమివ్వనున్నట్లు సమాచారం.