బడ్జెట్ ప్రకటనలో వరాల జల్లు కురిపించిన ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వం

-

మహారాష్ట్ర అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా భారీగా తాయిలాలు ప్రకటించారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో ఎన్డీఏ కూటమి భారీగా నష్టపోయింది.. మరోవైపు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికలే లక్ష్యంగా బడ్జెట్ ప్రకటనలో ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది.

” సీఎం మాఝీ లడ్కీ బహిన్” పథకం కింద 21 నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్సు గల మహిళలకు నెలకు రూ.1,500 అందజేస్తున్నట్లు ప్రకటించారు. ఇక 10 లక్షల మంది ఇంటర్న్‌లకు నెలకు రూ.10,000 స్టైఫండ్ ,పంట నష్టానికి పరిహారంగా చెల్లించాల్సిన గరిష్ట మొత్తం రూ. 50,000కి పెంచారు.ఆవు పాల రైతులకు లీటర్‌కు రూ.5 సబ్సిడీ ఇస్తామని తెలిపారు. అంతేకాకుండా 44 లక్షల మంది రైతులకు విద్యుత్ బిల్లు బకాయిలు మాఫీ చేస్తామని అజిత్ పవార్ ప్రకటించారు. దీంతో పాటు ముంబై ప్రాంతంలో పెట్రోల్‌పై పన్నును 26 శాతం నుంచి 25 శాతానికి తగ్గిస్తున్నట్లు వెల్లడించారు. అంటే పెట్రోల్ ధరలు లీటరుకు 65 పైసలు తగ్గుతాయి. డీజిల్‌పై పన్నును 24 శాతం నుంచి 21 శాతానికి తగ్గించారు. దీంతో ముంబై ప్రాంతంలో డీజిల్ ధర లీటర్‌కు రూ.2 తగ్గుతాయని అన్నారు. అలాగే పేద కుటుంబాలకు ప్రతి సంవత్సరం మూడు ఉచిత ఎల్‌పిజి సిలిండర్లు ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news