కేంద్ర ఎన్నికల సంఘం ఈ రోజు ప్రకటించిన ఎన్నికల షెడ్యూల్ లో భాగంగా తెలంగాణ, ఛత్తీస్ ఘడ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ మరియు మిజోరాం రాష్ట్రాలకు నవంబర్ 30వ తేదీన ఎన్నికలు జరిపించనున్నారు. ఇప్పటికే ఈ అయిదు రాష్ట్రాలలోని పార్టీలు అన్నీ కూడా అభ్యర్థులను ప్రకటించే పనిలో తలమునకలై ఉన్నారు. ఇక తెలంగాణాలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.. ఈ రోజు నుండి ఏ ఒక్క వ్యక్తి అయినా రూ. 50 వేలు కన్నా మించి కనుక తీసుకువెళ్తే ఖచ్చితంగా అందుకు సంబంధించిన పూర్తి ఆధారాలు ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే చిక్కుల్లో పడే ఛాన్సెస్ ఉంటాయి.. ఉదాహరణకు: హాస్పిటల్ కోసమైతే రోగికి సంబంధించిన రిపోర్ట్స్ ఉండాలి, శుభకార్యాలు అయితే కార్డ్స్ ఖచ్చితంగా ఉండాలి.. ఇక దేనికి సంబంధించి అయినా ఆధారాలు ఖచ్చితం.
ఒకవేళ ఎటువంటి ఆధారాలు లేకపోయినా పోలీసులు కనుక సీజ్ చేస్తే ఎన్నికల అయిపోయిన తర్వాత ఆధారాలు చూపించినా అవి తిరిగి ఇచ్చేస్తారు.. కాబట్టి చాలా జాగ్రత్తగా డబ్బులు విషయంలో వ్యవహరించాల్సి ఉంటుంది.