గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఎంత కట్టాలో తెలుసా…?

-

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపధ్యంలో ఎన్నికల కమీషనర్ పార్ధసారథి నోటిఫికేషన్ విడుదల చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… డిసెంబర్ 1న ఉదయం 7నుంచి సాయంత్రం 6గంలకు వరకు పోలింగ్ ఉంటుందని అన్నారు. ఇండిపెండెంట్ అభ్యర్థులకు ప్రత్యేక గుర్తులు కేటాయుస్తాం అని ఆయన తెలిపారు. డిసెంబరు 4వ తేదీ మధ్యాహ్నం 3గంల వరకు ఫలితాలు వస్తాయని చెప్పారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు రూ.2,500 డిపాజిట్ చేయాలని అన్నారు. జనరల్ అభ్యర్థులకు 5వేల రూపాయల డిపాజిట్ చేయాలని పేర్కొన్నారు. ఆన్ లైన్ లో నామినేషన్ ఫాంను అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకోవాలి అని పేర్కొన్నారు. పోటీ చేసే అభ్యర్థి ఖర్చు పరిమితి 5 లక్షలు అని ఆయన వివరించారు. 45రోజుల లోపు అభ్యర్థి తన ఖర్చుల వివరాలను ఈసీకి సమర్పించాలన్నారు. తప్పుడు వివరాలు సమర్పిస్తే అభ్యర్థిని 3ఏళ్ళ పాటు అనర్హుడిగా ప్రకటించే హక్కు ఎస్ఈసీకి ఉంది అని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version